Director Maruthi : అటు ప్రభాస్.. ఇటు చిరంజీవి.. మధ్యలో మారుతి..

బోల్డ్ కామెడీ సినిమాలనుంచి బిగ్ స్టార్స్ తో కమర్షియల్ సినిమాలు చేసే రేంజ్ కి వెళ్లిపోయాడు డైరెక్టర్ మారుతి. వన్ బై వన్ హీరోల రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్న మారుతి......

Director Maruthi : అటు ప్రభాస్.. ఇటు చిరంజీవి.. మధ్యలో మారుతి..

Chiranjeevi

Director Maruthi :  బోల్డ్ కామెడీ సినిమాలనుంచి బిగ్ స్టార్స్ తో కమర్షియల్ సినిమాలు చేసే రేంజ్ కి వెళ్లిపోయాడు డైరెక్టర్ మారుతి. వన్ బై వన్ హీరోల రేంజ్ ని పెంచుకుంటూ వెళుతున్న మారుతి మొన్న ప్రభాస్ తో సినిమా అన్నారు, లేటెస్ట్ గా చిరంజీవికి కథ రెడీ చేస్తున్నా అంటున్నారు. డైరెక్టర్స్ లో మారుతి డిఫరెంట్. బోల్డ్ కామెడీ కంటెంట్ తో ఫస్ట్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసి తర్వాత గానీ కమర్షియల్ కథల్లోకి వెళ్లలేదు మారుతి. ఈ రోజుల్లో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మారుతి కెరీర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలతో మరింత క్రేజ్ వచ్చింది మారుతికి. దాంతో వరస పెట్టి మిడిల్ రేంజ్ హీరోలు మారుతితో సినిమాలు చెయ్యడానికి రెడీ అయ్యారు. వాళ్లను దాటుకుంటూ ఇప్పుడు మారుతి స్టార్ హీరోల దగ్గర ఆగాడు.

మిడిల్ రేంజ్ హీరోలు.. శర్వానంద్, సాయిధరమ్ తేజ్, గోపీచంద్, నానిలతో సినిమాలు చేసిన మారుతి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు. అసలు చిరంజీవే మారుతితో కథ రెడీ చెయ్ అని పబ్లిక్ గా చెప్పారు. ఏదో రొటీన్ కామెడీకి కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేసి ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న మారుతికి స్టార్ హీరోలతో సినిమా చేసే కెపాసిటీ ఉందా అంటూ తెగ డౌట్ పడిపోతున్నారు ఫ్యాన్స్.

Avika Gor : నా ప్రతి అడుగులోనూ తనే ఉన్నాడు.. ప్రియుడి గురించి గొప్పగా చెప్తున్న చిన్నారి పెళ్లికూతురు..

మెగాస్టార్ తోనే కాదు, మొన్నీ మధ్య ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటూ హడావిడి చేశారు. వరసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కామెడీ తో నవ్వులు పూయిస్తారని, వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తారని టాక్ కూడా నడిచింది. సినిమా మొదలు కాకపోయినా మారుతి మాత్రం ప్రభాస్ తో సినిమా ఉండనే చెప్తున్నాడు. మరి కమర్షియల్, మాస్ సినిమాలు, హై రేంజ్ సినిమాలు చేస్తున్న స్టార్స్ మారుతి కథల్లో ఇమడగలరా, మారుతి హ్యూమర్ తో హిట్ కొట్టగలరా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అదృష్టం బాగుండి ఒక్క స్టార్ హీరోతో ఒక్క హిట్ పడ్డా మారుతి కూడా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాడు. మరి ప్రభాస్, చిరంజీవి సినిమాల్లో మారుతి ఏది ముందు తెస్తాడో చూడాలి.