VN Aditya : మన తప్పుల వల్లే తెలుగు సినిమాలకి నేషనల్ అవార్డులు ఎక్కువగా రావట్లేదు

జాతీయ అవార్డుల ఫైనల్ జ్యూరీలో ఉన్న ఏకైక తెలుగు మెంబర్ ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలకి ఎక్కువ అవార్డులు రాకపోవడానికి మనమే కారణం, మన తప్పుల వల్లే అవార్డులు రావట్లేదు అని........

VN Aditya : మన తప్పుల వల్లే తెలుగు సినిమాలకి నేషనల్ అవార్డులు ఎక్కువగా రావట్లేదు

National Film Awards

National Film Awards :  ఇటీవల 68వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మూడు తెలుగు సినిమాలకు అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డుల ఫైనల్ జ్యూరీలో ఉన్న ఏకైక తెలుగు మెంబర్ ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన నేషనల్ అవార్డుల ఎంపిక ఫైనల్ జ్యూరీలో మెంబర్ గా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలకి ఎక్కువ అవార్డులు రాకపోవడానికి మనమే కారణం, మన తప్పుల వల్లే అవార్డులు రావట్లేదు అని అన్నారు.

విఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ”మనం ఎక్కువగా వినోదం, కమర్షియల్ మోడల్‌లోనే సినిమాలు తీస్తాం. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసే విషయంలో తెలుగు సినిమాలే ముందు ఉన్నాయి. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ప్రేక్షకులకు వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మన దగ్గర ప్రతిభకు కొదవ లేదు. కానీ మన తెలుగు సినిమాలు అవార్డుల మీద ఫోకస్ చేయవు. కొన్నిసార్లు హీరో ఇమేజ్‌ కోసం కథలో కాంప్రమైజ్‌ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. తమిళ్, మలయాళ సినిమాల్లో అలా చేయరు. అందుకే వాటికి అవార్డులు ఎక్కువగా వస్తాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలు మనం కూడా తీస్తే మనకి కూడా అవార్డులు వస్తాయి.”

 

Samantha : డబ్బులిచ్చి నంబర్ 1 స్థానాన్ని కొనుక్కున్నాను..

”అలాగే మన వాళ్ళు అవార్డుల ఎంట్రీకి సినిమాలు ఎక్కువగా పంపరు. జాతీయ అవార్డులు మనకు రావులే అని ముందుగానే చాలా మంది అనుకుంటారు. తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీ భాషల నుంచి వచ్చిన ఎంట్రీలు మన తెలుగు సినిమాల నుంచి రాలేదు. ప్రయత్నలోపం మనదే. మనకు తక్కువ అవార్డులు రావడానికి కూడా కారణం అదే. బయట నేను చుసిన చాలా మంచి సినిమాలు అసలు అవార్డులకు అప్లై చేయలేదు. దీనిపై మన ఫిల్మ్‌ ఛాంబర్, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలి. అలాగే అవార్డులకు అప్లికేషన్‌ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్‌ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్‌ పోగొట్టుకుంటున్నాయి. ఇలా అనేక కారణాల వల్ల తెలుగు సినిమాలు అసలు ఎంట్రీలో ఉండట్లేదు” అని తెలిపారు.