Bro : స్పెషల్ సాంగ్‌లో Bro తో చిందేయడానికి పోటీ పడుతున్న భామలు.. నిజమేనా?

పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ అండ్ టాలీవుడ్ భామల పేరులను మూవీ టీం..

Bro : స్పెషల్ సాంగ్‌లో Bro తో చిందేయడానికి పోటీ పడుతున్న భామలు.. నిజమేనా?

Disha Patani Shruti Haasan for special song in Pawan Kalyan Bro movie

Pawan Kalyan Bro : మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam tej) కలిసి నటిస్తున్న ‘Bro’ సినిమా పై రోజురోజకి అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ పవన్ లుక్ ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ వీడియో రికార్డ్స్ క్రియేట్ చేసింది. తాజాగా సాయి తేజ్ కి సంబంధించిన లుక్ ని కూడా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ ఈ సినిమాలో ‘మార్కండేయులు’ అలియాస్ ‘మార్క్’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

Dimple Hayathi : DCP ఉద్దేశం వేధించడం.. మేము లీగల్‌గా ఫైట్ చేస్తాం.. డింపుల్ హయతి లాయర్!

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మోషన్ పోస్టర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉందంటూ ఆడియన్స్ నుంచి కామెంట్స్ అందుకున్నాడు. అయితే సినిమాలో పాటలు గురించి ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయట. పవన్ కళ్యాణ్ పైనే రెండు పాటలు ఉండగా.. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్ అని సమాచారం. ఇక ఈ సాంగ్ లో పవన్ తో చిందులేసేందుకు ఇద్దరు భామల పేరులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

Bro : మార్క్ ని పరిచయం చేసిన బ్రో.. మామా అల్లుళ్ళ లుక్స్ అదుర్స్‌!

ఒకరు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) అయితే, మరొకరు గబ్బర్ సింగ్ బ్యూటీ శ్రుతి హాసన్‌ (Shruti Haasan). వీరిద్దరిలో ఎవరొకరిని ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మూవీ టీం ఫైనల్ చేయనుందట. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా కేతిక శర్మ (Ketika Sharma) నటించబోతుందని తెలుస్తుంది. మరో అందాల భామ ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించబోతుందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.