Project K: ప్రాజెక్ట్-K గ్లింప్స్‌పై దుల్కర్ హాట్ కామెంట్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్-K కోసం అభిమానులు ఎంత ఆసక్తిగాా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ పై మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశాడు.

Project K: ప్రాజెక్ట్-K గ్లింప్స్‌పై దుల్కర్ హాట్ కామెంట్స్

Project K: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘సీతా రామం’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 3న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా వచ్చాడు. ఇక ఈ క్రమంలో సీతా రామం మూవీ సూపర్ హిట్ కావాలని ఆయన కోరారు. అయితే ఈ ఈవెంట్‌లో హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్-K’ గురించిన ప్రస్తావన కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

Project K: బిగ్ స్టార్ క్యాస్టింగ్‌తో ప్రాజెక్ట్ కే.. పెరిగిపోతున్న అంచనాలు!

సీతా రామం చిత్రానికి బూస్ట్ ఇచ్చిన ప్రభాస్‌కు హీరో దుల్కర్ సల్మాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ క్రమంలో దుల్కర్ మాట్లాడుతూ.. ఇండియన్ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా ముందుకు తీసుకెళ్తున్న హీరో ప్రభాస్ అని అన్నారు. ఆయన నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. అయితే ఎవరికీ దక్కని అదృష్టం తనకు దక్కిందని.. తాను ఇటీవల ప్రాజెక్ట్-K గ్లింప్స్‌ను చూశానని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని ఆయన అన్నారు.

Project K: రూమర్స్‌కు చెక్.. ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో ప్రభాస్!

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో దుల్కర్ అలజడిని క్రియేట్ చేశాడని చెప్పాలి. ఇప్పటివరకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాడు దుల్కర్. ఇక ప్రాజెక్ట్K గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటెసీ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి నిజంగానే ప్రాజెక్ట్ K గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రెడీ చేసిందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభాస్ అండ్ టీమ్ ఏదైనా రెస్పాన్స్ ఇస్తారేమో చూడాలి.