Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ Fans on good appetite on Sarkaru Vaari Paata.. Release countdown starts

Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా.. ఇప్పడు ఇదీ సూపర్ స్టార్ సినిమా టీమ్ కాన్ఫిడెన్స్ లెవల్. కరోనాతో లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సర్కార్ వారి పాట సినిమాతో బిగ్ సక్సెస్ కొట్టడం ఖాయం అన్నట్టే చెబుతున్నారు ఈ సినిమాకు వర్క్ చేసిన టెక్నిషియన్స్.

Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

Sarkaru Vaari Paata: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్టు దిగిందా లేదా.. ఇప్పడు ఇదీ సూపర్ స్టార్ సినిమా టీమ్ కాన్ఫిడెన్స్ లెవల్. కరోనాతో లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చి సర్కార్ వారి పాట సినిమాతో బిగ్ సక్సెస్ కొట్టడం ఖాయం అన్నట్టే చెబుతున్నారు ఈ సినిమాకు వర్క్ చేసిన టెక్నిషియన్స్. మాస్, కామెడి, రొమాన్స్ అన్ని యాంగిల్స్ ను టచ్ చేసిన ఈ సినిమా పోకిరి రేంజ్ లో హిట్ కొడుతుందా? గత రికార్డులను బ్రేక్ చేస్తుందా? ఇలాంటి వివరాలు పూర్తిగా స్టోరీలో చూద్దాం.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో బన్నీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

మే 12న సర్కారు వారి పాట రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా మూడు రోజులే టైమ్ ఉంది. ఇప్పటికే సరికొత్త పంథాలో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు మూవీ టీమ్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ మహేశ్ ఒరిజినల్ నేమ్ తోనే క్యారెక్టర్ డిజైన్ చేశారు పరుశురామ్.. మమమమ మహేశా సాంగ్ తో మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు సూపర్ స్టార్.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మైండ్ బ్లాక్ చేసిన ఆయన సర్కార్ వారి పాటలో ఫ్లవర్స్ తోనే మాస్ పవర్ చూపించారు. ముందుంది మాస్ జాతర అన్న కాన్ఫిడెన్స్ ను ఫ్యాన్స్ కు కలిగించారు మహేశ్ బాబు.

Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగానే గ్యాప్ తీసుకున్నారు. మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్ కి మాస్ మసాలా ట్రైలర్ చూపించారు. ఇంకేముంది సినిమా రిలీజ్ కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దానికి తగ్గట్టే ప్రమోషనల్ కంటెంట్ తోనే దూకుడు చూపిస్తున్నారు ప్రిన్స్. సినిమా కాస్ట్ దగ్గరి నుంచి టెక్నీషియన్స్ వరకు వరుస ఇంటర్వ్యూలతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. ఇక ఫ్యామిలీతో పారిస్ చుట్టొచ్చిన సూపర్ స్టార్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. ఈ సినిమాను థియేటర్లో చూసి, రెస్పాన్స్ ఇవ్వాలని తన అభిమానులను రెక్వెస్ట్ చేస్తూ, తన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్ తో జూన్ లోనే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపుతూ లెటర్ రిలీజ్ చేసి, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. డైరెక్ట్ గా ప్రి రిలీజ్ ఈవెంట్ లో కనిపించి, అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే?

మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను హైదరాబాద్‌ యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో గ్రాండ్‌గా నిర్వహించారు. అభిమానులు సందడి మామూలుగా లేదు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ అటు క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఆయన పలికిన డైలాగ్స్ హైలైటయ్యాయి. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. కళావతి సాంగ్ అయితే ఇప్పటికే 16 కోట్ల ఇరవై లక్షల అరవై వేలకు పైగా వ్యూస్ తో రికార్డ్ స్థాయిలోనే దూసుకెళ్తోంది. ఆల్ ఎమోషన్స్ ను మిక్స్ చేసిన ఈ ట్రైలర్ మోస్ట్ వ్యూయ్డ్ టాలీవుడ్ ట్రైలర్ గా నంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది.

Sarkaru Vaari Paata: దొంగలెత్తుకెళ్లిన కీర్తి సురేష్ కాస్ట్యూమ్స్.. ఏం జరిగిందంటే?

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రయిలర్ తో ఈ సినిమా పైన హై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. మహేశ్ బాబు కెరీర్ లో నే ఓవర్సీస్ అో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా మే 11న రిలీజ్ చేయబోతున్నారు. దాంతో మహేశ్ బాబు అభిమానులు సర్కార్ వారి పాట సినిమా, పోకిరి రేంజ్ లో ఆల్ టైమ్ హిస్టరీ రికార్డ్స్ బద్ధలు కొట్టడం ఖాయం అని హాపీ ఫీలవుతున్నారు. భారీ హోప్స్ పెట్టుకుని మే 12 తేదీ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు.

×