Virata Parvam: తండ్రీ కొడుకుల రిలీజ్ వార్.. ఫైనల్ గా ఓటీటీలోనే?!

ఒకపక్క కరోనా గతంలో వచ్చిన రెండు వేవ్ ల కంటే సూపర్ స్పీడ్ తో వ్యాపిస్తుంది. దీంతో థియేటర్లు ఓపెన్ చేసే ఉన్నా ప్రేక్షకులు మాత్రం వెళ్లేందుకు..

Virata Parvam: తండ్రీ కొడుకుల రిలీజ్ వార్.. ఫైనల్ గా ఓటీటీలోనే?!

Virata Parvam

Virata Parvam: ఒకపక్క కరోనా గతంలో వచ్చిన రెండు వేవ్ ల కంటే సూపర్ స్పీడ్ తో వ్యాపిస్తుంది. దీంతో థియేటర్లు ఓపెన్ చేసే ఉన్నా ప్రేక్షకులు మాత్రం వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. బాలకృష్ణ లాంటి సీనియర్ మాస్ హీరోల సినిమాలకంటే ఛరిస్మాతో నెట్టుకొచ్చేసినా మిగతా వాళ్ళ సినిమాలకి ఇలాంటి సమయంలో థియేటర్లలో ఆదరణ దక్కడం కష్టమైన పనే అనుకోవచ్చు. అందుకే సినిమాలన్నీ వాయిదా పడగా ఒకరిద్దరు మాత్రమే ధైర్యం చేసి విడుదల చేస్తున్నారు.

Shooting Postpones: ఆగిన సినిమాలు.. సెట్స్ మీదకెప్పుడు? షూటింగ్ ఎప్పుడు?

అయితే.. ఎలాగు మోస్తరు, మీడియం బడ్జెట్ సినిమాలకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ రెడ్ కార్పెట్ పరిచి ఎలాగు వెల్ కం చెప్తున్నాయి కనుక అక్కడే రిలీజ్ చేసుకొనే వీలుంది. ఇప్పటికే తమిళంలో సూర్య లాంటి వాళ్ళతో పాటు హిందీలో కొందరు ఏ మాత్రం మొహమాటం లేకుండా ఓటీటీకి జై అంటున్నారు. తెలుగులో కూడా నిర్మాత సురేష్ బాబు పరిస్థితులు చక్కబడే వరకు తమ సినిమాలకు బెస్ట్ ఛాయిస్ ఓటీటీనే అని ఎప్పుడో చెప్పేశారు.

Web Series Telugu: ఓటీటీని దోచుకొనే పనిలో పడిన టాప్ డైరెక్టర్లు.. బడా ప్రొడ్యూసర్లు!

సురేష్ బాబు గత రెండు సినిమాలు నారప్ప, దృశ్యం2 లను ఓటీటీలోనే విడుదల చేయగా.. రానా విరాటపర్వం కూడా ముందు ఓటీటీలోనే వస్తుందని అనుకున్నారు. కానీ.. విరాటపర్వం థియేటర్లో రిలీజ్ చేయాల్సిన సినిమా అని.. అందుకే నిర్ణయం మార్చుకున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ అంతలోనే షూటింగ్ కి బ్రేక్ పడడం.. రిలీజ్ కి ముహూర్తం దొరకకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!

దీంతో ఇప్పుడు మళ్ళీ ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కొత్తగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా గట్టిగా ప్రచారం జరుగుతుంది. సురేష్ బాబు ఓటీటీకి జై అని ఎప్పుడో చెప్పేశారు.. అయితే.. మధ్యలో రానా వలనే థియేటర్లలో రిలీజ్ అనే టాక్ నడిచింది. కానీ ఫైనల్ గా తండ్రీకొడుకుల మధ్య రిలీజ్ వార్ లో తండ్రే గెలిచాడని.. త్వరలోనే విరాటపర్వం ఓటీటీలో వస్తుందని తెలుస్తుంది.