Acharya Movie Set : చిరంజీవి ఆచార్య సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం.. కోట్ల రూపాయలు బుగ్గిపాలు..

ఆచార్య సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సెట్ లోపల మంటలు కనపడటంతో స్థానికులు దగ్గర్లోని ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి.........

Acharya Movie Set : చిరంజీవి ఆచార్య సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం.. కోట్ల రూపాయలు బుగ్గిపాలు..

fire broke out in Acharya Movie set and the entire set got burnt

Acharya Movie Set :  కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా గత సంవత్సరం ఏప్రిల్ 29న రిలీజయింది. మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా భారీ పరాజయం పొందింది. మెగా అభిమానులని కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ కోకాపేటలోని ఓ ఖాళీ స్థలంలో 20 ఎకరాల్లో ప్రత్యేకమైన సెట్ వేశారు.

ధర్మస్థలి టెంపుల్, గాలి గోపురం, దాని చుట్టూ ఓ గ్రామంలా భారీ సెట్ ని వేశారు. ఈ సెట్ మొత్తానికి దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు అయినట్టు అప్పట్లోనే తెలిపారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సురేష్ ఈ సెట్ ని అద్భుతంగా వేశారు. సినిమా బాగోలేకపోయినా ఈ సెట్ మాత్రం అద్భుతంగా కనిపించాయి సినిమాలో. అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఈ సెట్స్ ని తీయలేదు. ఆ స్థలం ప్రస్తుతానికి ఖాళీగానే ఉండటంతో సెట్ బాగుంది కదా అని తీయకుండా ఇంకా అలాగే ఉంచారు.

Siddharth-Aditi : మరోసారి ప్రేమ జంట వైరల్.. ట్రెండింగ్ సాంగ్‌కి కలిసి రీల్ చేసిన సిద్దార్థ్-అదితి

తాజాగా ఈ ఆచార్య సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సెట్ లోపల మంటలు కనపడటంతో స్థానికులు దగ్గర్లోని ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అంతలోనే ధర్మస్థలి టెంపుల్, ఆ చుట్టు పక్కల చాలా వరకు మంటల్లో కాలిపోయింది. దీంతో కోట్ల విలువైన సెట్ క్షణాల్లో బుగ్గిపాలైపోయింది. అయితే ఈ అగ్నిప్రమాదం ఓ వ్యక్తి సెట్ బయట కూర్చొని సిగరెట్ కాల్చి పారేయడంతో మంటలు అంటుకొని అవి అంతటా వ్యాపించి ఇలా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. దీనిపై ప్రస్తుతానికి ఆచార్య టీం ఎవరూ స్పందించలేదు. ఆచార్య సినిమా రామ్ చరణ్ సొంత నిర్మాణంలో తెరకెక్కడంతో ఈ సెట్ కూడా వాళ్ళే నిర్మించారు. మరి దీనిపై రామ్ చరణ్ కానీ, చిరంజీవి కానీ, కొరటాల శివ కానీ స్పందిస్తారేమో చూడాలి.