Bigg Boss 5: ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు.. ఎలిమినేట్ అయ్యేది?

బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ చూస్తుండాగానే చివరి దశకి వచ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటికే 12 వారాలు 12 మంది కంటెస్టెంట్లు ఇంటి నుండి ఎలిమినేట్ కాగా..

Bigg Boss 5: ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు.. ఎలిమినేట్ అయ్యేది?

Bigg Boss 5: బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ చూస్తుండాగానే చివరి దశకి వచ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటికే 12 వారాలు 12 మంది కంటెస్టెంట్లు ఇంటి నుండి ఎలిమినేట్ కాగా పదమూడో వారంలోకి అడుగుపెట్టి ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తిచేసుకుంది. ఊహించని విధంగా గత వారం రవి ఎలిమినేషన్ కావడంతో ఒకరంగా బిగ్ బాస్ ప్రేక్షకులను షాక్ కి గురిచేయగా.. ఎప్పుడు ఎవరో ఎలిమినేట్ అవుతారో తెలియని విధంగా ఉత్కంఠ మొదలైంది.

Bigg Boss 5: షన్నుకి హింట్ ఇచ్చిన దీప్తి.. బాబోయ్ ఇంత ఇంటెలిజెంటా?

ప్రస్తుతం హౌస్‌లో షణ్ముఖ్, సిరి, కాజల్, మానస్, శ్రీరామ్, ప్రియాంకా, సన్నీ.. మొత్తం 7 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉండగా.. ఈ వారం నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. ఈ వారం నామినేషన్స్ లో ఇంటిసభ్యులు తగిన కారణాలు చెప్తూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను గేటు బయటకు తన్నాలనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో కమ్యూనిటీ (ట్రాన్స్‌జెండర్‌) పేరు తీయడం తప్పంటూ కెప్టెన్‌ షణ్ముఖ్‌ కాజల్‌ను నామినేట్‌ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్‌ చేస్తూ ఆమె ఫేస్‌ ఉన్న బంతిని ఒక్క తన్ను తన్నాడు.

Bigg Boss 5 Elimination: రవి ఔట్.. అదే నిజమైతే విమర్శలు తప్పదా?

పాపం ప్రియాంక.. ఎవరిని నామినేట్‌ చేయాలో అర్థం కావట్లేదని సమయం వృథా చేయగా బిగ్‌బాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో పింకీ.. సిరిని, కాజల్‌ను నామినేట్‌ చేయగా.. శ్రీరామ్‌.. నన్ను అగౌరవపర్చారంటూ మానస్‌, కాజల్‌ను నామినేట్‌ చేశాడు. ఫైనల్ గా ఈ వారం ప్రియాంక, సిరి, మానస్, శ్రీరామ్‌, కాజల్‌లు నామినేషన్‌లోకి రాగా, కెప్టెన్‌ అయిన కారణంగా షణ్ముఖ్‌, ఎవరూ నామినేట్‌ చేయకపోవడంతో సన్నీ ఈ వారం నామినేషన్‌లోకి రాలేదు. మరి ఈ నామినేట్ అయిన 5 మందిలో ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు పోతారన్న మొదలైంది.