Game Changer : గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్.. వైరలవుతున్న డైరెక్టర్ శంకర్ పోస్ట్..

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా షూట్స్ నుంచి లీక్ అయిన కొన్ని పిక్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతుంది.

Game Changer : గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్.. వైరలవుతున్న డైరెక్టర్ శంకర్ పోస్ట్..

Game Changer movie climax shoot completed said by Director Shankar

Game Changer :  రామ్ చరణ్(Ram Charan) RRR సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో RC15 సినిమా గేమ్ ఛేంజర్(Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి(Sankranthi) రిలీజ్ చేస్తారని గతంలోనే దిల్ రాజు ప్రకటించాడు.

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా షూట్స్ నుంచి లీక్ అయిన కొన్ని పిక్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఇందులో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో దాదాపు 1000 కి మంది పైగా ఫైటర్స్ తో భారీ క్లైమాక్స్ ఫైట్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాపై డైరెక్టర్ శంకర్ అప్డేట్ ఇచ్చారు.

Arjun Rampal : NBK 108 కోసం బాలీవుడ్ హీరో.. బాలయ్య బాబు వర్సెస్ అర్జున్ రాంపాల్..

గేమ్ ఛేంజర్ సెట్ లోంచి ఓ ఫోటోని షేర్ చేసి అద్భుతమైన గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ ఇవాళ పూర్తి అవుతుంది. దీని తర్వాత ఇండియన్ 2 సినిమా షూటింగ్ కి వెళ్తాను అని తెలిపారు. దీంతో అప్పుడే గేమ్ ఛేంజర్ సినిమా షూట్ పూర్తయిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే సినిమా మొత్తం పూర్తికాలేదని, ఇంకా షూటింగ్ ఉందని, ఇప్పుడు కేవలం క్లైమాక్స్ పార్ట్ మాత్రమే అయినట్టు సమాచారం. ఇక శంకర్ ఇటు గేమ్ ఛేంజర్, అటు ఇండియన్ 2 సినిమాలు రెండూ ఒకేసారి చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి శంకర్ ట్వీట్ తో ఓ అప్డేట్ వచ్చిందని చరణ్ అభిమానులు సంతోషిస్తున్నారు.