Gauri Khan : షారుఖ్‌తో విడిపోయి మళ్ళీ కలిసాను..

గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. ''షారుఖ్ నా మాట వినడు. షూటింగ్స్ లో బిజీగా ఉంటూ ఫ్యామిలీని పట్టించుకోడు. అంతేకాక షారుఖ్‌కి పొసెసివ్‌నెస్ ఎక్కువ. మొదట్లో దాన్ని నేను భరించలేకపోయాను..........

Gauri Khan :  షారుఖ్‌తో విడిపోయి మళ్ళీ కలిసాను..

Gaury Khan

 

Gauri Khan :  ఇటీవల చాలా మంది స్టార్ సెలబ్రిటీలు విడిపోతున్నారు. పెళ్లంటే నూరేళ్ళ పంట కాదు మంట అంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమలలోని విడాకులు పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో అయితే ఈ సంఖ్య కాస్త ఎక్కువే. బాలీవుడ్ లో పెళ్లంటే చాలామందికి ఒక టైం పాస్ లా అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఇలా ఇటీవల కాలంలో విడాకులు పెరిగిపోతున్న నేపథ్యంలో షారుఖ్ భార్య గౌరీఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ భార్యగా గౌరీఖాన్‌ అందరికి సుపరిచితమే. 1991లోనే వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ ప్రోగ్రామ్‌కు హాజరైన గౌరీ షారుఖ్ గురించి అనేక విషయాలని తెలియచేసింది. దాంతో పాటు గతంలో షారుఖ్ తో విడిపోయి మళ్ళీ కలిసినట్టు కూడా తెలిపింది.

Poonam Khaur : పవన్‌తో ఛాన్స్ వచ్చినా.. కావాలనే తప్పించారు..

గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. ”షారుఖ్ నా మాట వినడు. షూటింగ్స్ లో బిజీగా ఉంటూ ఫ్యామిలీని పట్టించుకోడు. అంతేకాక షారుఖ్‌కి పొసెసివ్‌నెస్ ఎక్కువ. మొదట్లో దాన్ని నేను భరించలేకపోయాను. నాకు పర్సనల్‌ స్పేస్‌ కావాలని అనుకోని అది అతనికి చెప్పి షారుఖ్‌కి దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత మళ్లీ ఆలోచించుకుని అది పొసెసివ్‌నెస్ కాదు ప్రేమ అని అర్ధం చేసుకున్నాక షారుఖ్ దగ్గరకు తిరిగి వచ్చాను. ఆ తర్వాత నుంచి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చినా వెంటనే కలిసిపోతాము.” అంటూ తన భర్త గురించి, ప్రేమ గురించి, పెళ్లి జీవితం అంటే అడ్జస్ట్ అవ్వాలని తెలిపింది.

Samantha : డ్రెస్సింగ్ స్టైల్‌పై వచ్చిన ట్రోల్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత

గౌరీ ఖాన్ చెప్పింది విని అయినా స్టార్ కపుల్స్ విడాకుల గురించి ఆలోచించకుండా, నాది, నీది, పర్సనల్ అంటూ పోకుండా పెళ్లి అంటే ఇద్దరూ అని అర్ధం చేసుకొని బతుకుతారని, అడ్జస్ట్ అయి కలిసి బతుకుతారు అని అనుకుంటున్నారు సెలబ్రిటీల అభిమానులు.