Raviteja : క్రాక్ 2 వస్తుందంటూ క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని..

'రావణాసుర' (Ravanasura) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రాక్ 2 (Krack) ని ప్రకటించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.

Raviteja : క్రాక్ 2 వస్తుందంటూ క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని..

Gopichand Malineni announced Krack 2 at Ravanasura pre release event

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో అక్కినేని హీరో సుశాంత్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. మేఘా ఆకాశ్ (Megha Akash), అను ఇమ్మాన్యుయెల్ (Anu Emmanuel), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ ముద్దుగుమ్మలు ఈ సినిమాలో మెరబోతున్నారు. ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ సినిమా పై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి.

Ravanasura : రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ తో పాటు దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి గెస్ట్ లుగా వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ క్రాక్ 2 పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 2021లో వచ్చిన క్రాక్ గోపీచంద్ అండ్ రవితేజ కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది. ఆ సినిమాకి ముందు ఇద్దరు ప్లాప్ లతో సతమతం అవుతున్నారు. దీంతో క్రాక్ సినిమా వీరిద్దరి కెరీర్ లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోయింది. కేవలం వారిద్దరికీ మాత్రమే కాదు. రవితేజ ఫ్యాన్స్ కి కూడా క్రాక్ సినిమా ఎంతో స్పెషల్.

Raviteja : ప్రొడ్యూసర్ గా నాకు ఈ సినిమా హిట్ అవ్వాలి.. పది సినిమాలు చేయాలనుకున్నాం..

దీంతో వీరిద్దరి కాంబినేషన్ కోసం మరోసారి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రాక్ 2 గురించి ఫ్యాన్స్ ప్రశ్నించగా.. ‘తప్పకుండా ఉంటుంది. త్వరలోనే క్రాక్ 2తో రాబోతున్నా’ అంటూ బదులిచ్చాడు. ఇక ఈ మాటలు విన్న రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో గోపీచంద్ అండ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమా సూపర్ హిట్టుగా నిలిచాయి. మరి ఈ క్రాక్ 2 ఎప్పుడు పట్టాలు ఎక్కబోతుందో చూడాలి.