Gopichand: ఫ్లాప్ డైరెక్టర్‌తో గోపీచంద్ సినిమా.. రిస్క్ అవసరమా అంటోన్న ఫ్యాన్స్!

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో గోపీచంద్ తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే దర్శకుడు శ్రీవాస్‌తో తన నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్లు గోపీచంద్ వెల్లడించాడు. ఈ సినిమా ఇంకా పూర్తికాకముందే, గోపీచంద్ తన నెక్ట్స్ మూవీని ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

Gopichand: ఫ్లాప్ డైరెక్టర్‌తో గోపీచంద్ సినిమా.. రిస్క్ అవసరమా అంటోన్న ఫ్యాన్స్!

Gopichand Next Movie With Srinu Vaitla

Gopichand: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ఇటీవల ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో గోపీచంద్ తన నెక్ట్స్ చిత్రాన్ని లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే దర్శకుడు శ్రీవాస్‌తో తన నెక్ట్స్ మూవీ ఉండబోతున్నట్లు గోపీచంద్ వెల్లడించాడు.

Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సినిమా ఇంకా పూర్తికాకముందే, గోపీచంద్ తన నెక్ట్స్ మూవీని ఓ ఫ్లాప్ డైరెక్టర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఒకప్పుడు దూకుడు వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీను వైట్ల, ఆ తరువాత ఇప్పటివరకు ఒక్క హిట్ సినిమా కూడా తీయలేదు. దీంతో ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.

Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..

కాగా, మంచు విష్ణుతో ఢీ-2 సినిమా తీస్తున్నట్లు గతంలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినా, ఆ సినిమా ప్రస్తుతం పక్కనబెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల శ్రీను వైట్ల గోపీచంద్‌కు ఓ కథను వినిపించగా, అది బాగా నచ్చిన గోపీచంద్ వైట్లతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ విషయం తెలుసుకున్న గోపీచంద్ ఫ్యాన్స్, శ్రీను వైట్ల‌తో సినిమా చేసి రిస్క్ తీసుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.