Guneet Monga : ఆస్కార్ వాళ్ళు నా స్పీచ్ కట్ చేసేశారు.. వేరేవాళ్లు ఎక్కువ మాట్లాడినా పట్టించుకోలేదు.. గునీత్ మోంగా వ్యాఖ్యలు..

గునీత్ మోంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేటగిరిలో మాతో పాటు ఉన్న సినిమాలు మాకు బాగా పోటీ ఇచ్చాయి. కానీ మా సినిమా అందర్నీ మెప్పించి ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ వేదికపై నేను మైక్ తీసుకొని......................

Guneet Monga : ఆస్కార్ వాళ్ళు నా స్పీచ్ కట్ చేసేశారు.. వేరేవాళ్లు ఎక్కువ మాట్లాడినా పట్టించుకోలేదు.. గునీత్ మోంగా వ్యాఖ్యలు..

Guneet Monga emotional after reaching india with Oscar Award and comments on Oscar team

Guneet Monga : 95వ ఆస్కార్ వేడుకల్లో మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండూ ఆస్కార్ సాధించడంతో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ రెండు టీమ్స్ కి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగియడంతో ఆస్కార్ అందుకున్న వాళ్ళు ఇండియాకు సగర్వంగా తిరిగొచ్చారు.

ది ఎలిఫెంట్ విష్పరర్స్ నిర్మాత గునీత్ మోంగా శుక్రవారం ఉదయం అమెరికా నుండి ముంబైకి వచ్చింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆస్కార్ అవార్డు పట్టుకొని గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా గునీత్ మోంగాకు ఎయిర్ పోర్ట్ వద్ద భారీ స్వాగతం లభించింది. పలువురు అభిమానులు, సినిమా టీం, మీడియా ఎయిర్ పోర్ట్ వద్ద సందడి చేసి ఆమెకు దండలు వేసి, డప్పులు కొట్టి, హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పారు. గునీత్ మోంగా తన ఆస్కార్ అవార్డుతో అభివాదం చేసుకుంటూ వెళ్ళింది.

అనంతరం గునీత్ మోంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేటగిరిలో మాతో పాటు ఉన్న సినిమాలు మాకు బాగా పోటీ ఇచ్చాయి. కానీ మా సినిమా అందర్నీ మెప్పించి ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ వేదికపై నేను మైక్ తీసుకొని మాట్లాడటం మొదలుపెట్టగానే మ్యూజిక్ ప్లే చేసి నా స్పీచ్ ని అడ్డుకున్నారు. గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నట్టు అనిపించింది. నా తర్వాత అవార్డులు అందుకున్న కొంతమంది 45 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడినా ఏం అనలేదు, వాళ్ళ స్పీచ్ ఆపలేదు. ఈ విషయంలో ఆస్కార్ వాళ్ళు చేసింది సరైంది కాదు అని బాధపడింది.

Das Ka Dhamki Pre Release Event : దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

సాధారణంగా ఆస్కార్ స్టేజిపై అవార్డు అందుకునే వాళ్లకు మాట్లాడటానికి 45 సెకండ్లు మాత్రమే ఇస్తారు. అంతకంటే ఎక్కువ మాట్లాడితే వారి స్పీచ్ ని ఆపేస్తారు. ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాకు గాను దర్శకురాలు కార్తీకి మాట్లాడిన తర్వాత గునీత్ మోంగా మాట్లాడుతుండగానే మ్యూజిక్ ప్లే చేసి స్పీచ్ ని అడ్డుకోవడంతో ఆమె బాధపడ్డారు.