Hanu Raghavapudi: అక్కినేని హీరోతో హను రాఘవపూడి సినిమా?

'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు "హను రాఘవపూడి". సున్నితమైన ప్రేమకథలను తెరకెక్కిస్తూ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. దుల్క్యూర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లోను మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ దర్శకుడి తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందో అని పెద్ద చర్చే జరుగుతుంది. ఈ క్రమంలోనే హను రాఘవపుడి తన నెక్స్ట్ మూవీని...

Hanu Raghavapudi: అక్కినేని హీరోతో హను రాఘవపూడి సినిమా?

Hanu Raghavapudi Next Movie With Naga Chaitanya

Hanu Raghavapudi: ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు “హను రాఘవపూడి”. సున్నితమైన ప్రేమకథలను తెరకెక్కిస్తూ తెలుగునాట తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. ఇటీవల ఈయన తెరకెక్కిచిన ‘సీతారామం’ అద్భుతమైన విజయం అందుకున్న విషయం తెలిసిందే.

Sita Ramam: మళ్లీ వస్తోన్న సీతా రామం కాంబో.. అయితే అది మాత్రం కాదట!

దుల్క్యూర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లోను మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ దర్శకుడి తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందో అని పెద్ద చర్చే జరుగుతుంది. ఈ క్రమంలోనే హను రాఘవపుడి తన నెక్స్ట్ మూవీని అక్కినేని హీరోతో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యకి ఈ దర్శకుడు ఒక కథ కూడా వినిపించినట్లు, చైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మాటల్లో నిజమెంత ఉందో తెలియాలి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. అక్కినేని ఫ్యాన్స్ అయితే ఈ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు.