Sita Ramam: మళ్లీ వస్తోన్న సీతా రామం కాంబో.. అయితే అది మాత్రం కాదట!
టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా, ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు జంటగా నటించారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ మనముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Sita Ramam Combo To Team Up Again
Sita Ramam: టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా, ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు జంటగా నటించారు.
ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమాతో ఆయన సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే ఈ సినిమా కథ నచ్చిన నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చారు. కాగా, ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ మనముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా మరోసారి దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Sita Ramam: పెళ్లి కాకుండా పిల్లలని కంటానంటున్న సీతారామం హీరోయిన్..
అయితే ఈ సినిమాను కూడా నిర్మాత అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. కానీ, ఈ సినిమా ‘సీతా రామం’ చిత్రానికి సీక్వెల్ కాదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తోంది. ఈ సినిమాను కూడా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా తెరకెక్కించనుండగా, వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ‘సీతా రామం’ కాంబినేషన్ మరోసారి చేతులు కలుపుతుండటంతో, ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.