Sita Ramam: పెళ్లి కాకుండా పిల్లలని కంటానంటున్న సీతారామం హీరోయిన్..
టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతారామం’ సినిమా ఇటీవల విదుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని చూసిన కుర్రకారు తమ "డ్రీమ్ గర్ల్" కూడా మృణాల్ లా ఉండాలి అంటూ ఆశపడుతున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ తన "డ్రీమ్ బాయ్" ఎలా ఉండాలంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Sita Ramam Heroine Mrunal Thakur Comments on Marriage
Sita Ramam: టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సీతారామం’ సినిమా ఇటీవల విదుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ కీలక పాత్ర పోషించింది.
Sita Ramam: బాలీవుడ్ భరతం పట్టేందుకు రెడీ అయిన సీతా రామం!
ఈ సినిమాలో సీత పాత్రలో కట్టు, బొట్టుతో కుందనపు బొమ్మలా కనిపించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ని చూసిన కుర్రకారు తమ “డ్రీమ్ గర్ల్” కూడా మృణాల్ లా ఉండాలి అంటూ ఆశపడుతున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ తన “డ్రీమ్ బాయ్” ఎలా ఉండాలంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
“నేనేమి ఆలోచిస్తున్నానో ముందుగానే అర్ధం చేసుకునే వాడే నా భాగస్వామిగా రావాలి” అంటూ వెల్లడించింది. “అయితే అలాంటి వాళ్ళు అంత ఈజీగా దొరకరు, కానీ నాకు పిల్లలని కనాలనుంది. అందుకే సరోగసి పద్దతిలో పిల్లల్ని కంటాను లేదా మదర్ థెరీసా లాగా ఒంటరిగా మిగిలిపోతాను” అంటూ పెళ్లి, పిల్లలపై తన అభిప్రాయం చెప్పింది. ప్రస్తుతం ఈమె నటించిన సీతారామం సినిమా హిందీలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.