Ala Ninnu Cheri Movie : హుషారు హీరోతో హెబ్బా పటేల్.. ‘అలా నిన్ను చేరి’..

మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా........

Ala Ninnu Cheri Movie : హుషారు హీరోతో హెబ్బా పటేల్.. ‘అలా నిన్ను చేరి’..

Hebah Patel Ala Ninnu Cheri Movie motion poster released

Ala Ninnu Cheri Movie :  కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హుషారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి నూతన సంవత్సర కానుకగా అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టైటిల్ లోగో పోస్టర్‌ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి సినిమా సోల్ తెలిసేలా స్పెషల్ గా అట్రాక్ట్ చేశారు మేకర్స్. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ.. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.

UnStoppable : పండక్కి అన్‌స్టాపబుల్‌లో వీరసింహా రెడ్డి స్పెషల్ ఎపిసోడ్.. పవన్ ఎపిసోడ్ ఇప్పట్లో లేనట్టే..

‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనంద్ అందిస్తుండగా ఆండ్రూ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, ఎడిటర్ గా పలు సూపర్ హిట్ సినిమాలకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కోటగిరి వెంకటేశ్వర రావు పని చేస్తున్నారు. కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా చేస్తున్న ఈ సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు. సాల్మన్, రామకృష్ణ ఫైట్ మాస్టర్లుగా, సాంగ్స్ కొరియోగ్రాఫర్ గా భాను వర్క్ చేశారు. అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.