Hero Vishal: విశాల్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హై‌కోర్ట్.. ఆస్తుల వివరాలు చెప్పాలి!

తెలుగు వాడైనా తమిళ్ హీరోగా ఎదిగాడు "విశాల్". తమిళ్ నాట తనకంటూ ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకుని మూవీ ప్రొడ్యూసర్ గా, నటుడిగా పని చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒక రుణ ఒప్పందం జరిగింది. సెప్టెంబర్ 21, 2019 నాటి రుణ ఒప్పందం ప్రకారం విశాల్...

Hero Vishal: విశాల్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హై‌కోర్ట్.. ఆస్తుల వివరాలు చెప్పాలి!

Hero Vishal Received Notices from Madras High Court

Hero Vishal: తెలుగు వాడైనా తమిళ్ హీరోగా ఎదిగాడు “విశాల్”. తమిళ్ నాట తనకంటూ ఒక మాస్ ఇమేజ్ సంపాదించుకుని మూవీ ప్రొడ్యూసర్ గా, నటుడిగా పని చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. “పందెంకోడి” సినిమాతో తెలుగు వాళ్ళకి పరిచయమైన విశాల్, తన ప్రతి సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. ప్రస్తుతం విశాల్ నటించిన “లాఠీ” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.

Vishal: లాఠీ షూటింగ్ ముగించేసిన విశాల్!

పోలీస్ నేపథ్యంలో వస్తున్న లాఠీ సినిమా ఈ నెల ఆఖరిలో విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఇటీవల విశాల్ మద్రాస్ హై‌కోర్ట్ నుంచి నోటీసులు అందుకున్నారు. గతంలో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒక రుణ ఒప్పందం జరిగింది. సెప్టెంబర్ 21, 2019 నాటి రుణ ఒప్పందం ప్రకారం విశాల్ 21.29 కోట్లను లైకా నుంచి తీసుకోగా, వాటిని ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో ఆ సంస్థ హై కోర్ట్ ని ఆశ్రయించింది.

ఈ కేసులో భాగంగా విచారణకు హాజరైన విశాల్ ని మద్రాస్ హై‌కోర్ట్, రుణం తిరిగి చెల్లిచాలనే ఉద్దేశం లేదా అని ప్రశ్నించగా..”తన సొంత చిత్ర నిర్మాణ సంస్థలో 18 కోట్లు నష్టం రావడంతో చెల్లించలేకపోయాను” అంటూ బదులిచ్చారు. వాదనలు విన్న కోర్ట్ నిజానిజాలు తెలుసుకోడానికి విశాల్ ఆస్తుల వివరాలను తెలపమంటూ ఈ నెల 23కి కేసుని వాయిదా వేసింది.