Heroines : సెకండ్ ఇన్నింగ్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్న హీరోయిన్స్

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కి కెరీర్ తక్కువ కాలమే ఉంటుంది. వాళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా కొంతకాలం తర్వాత హీరోయిన్స్ గా తప్పుకొని అక్క, వదిన,..............

Heroines : సెకండ్ ఇన్నింగ్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్న హీరోయిన్స్

Heroines Second Innings

Heroines :   సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కి కెరీర్ తక్కువ కాలమే ఉంటుంది. వాళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా కొంతకాలం తర్వాత హీరోయిన్స్ గా తప్పుకొని అక్క, వదిన, అమ్మ, అత్త.. ఇలా వాళ్ళ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ చేయాల్సిందే. లేదంటే కొంతమంది హీరోయిన్ గా కెరీర్ అయిపోగానే పక్కకు తప్పుకుంటారు. మరికొంతమంది మాత్రం ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ సక్సెస్ అవుతారు. గతంలో మన తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ మీరాజాస్మిన్, సదా, భూమిక, స్నేహ, జెనీలియా. పదేళ్ల క్రితం వీళ్లంతా తెలుగులో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు.

గుడుంబా శంకర్, భద్ర లాంటి సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్ పెళ్లి చేసుకొని సినిమాలకి గ్యాప్ ఇచ్చింది. విడాకులు అవ్వడంతో మళ్ళీ సినిమాలకి వచ్చి ఎలాంటి పాత్రలకైనా రెడీ అని సెకండ్ ఇన్నింగ్స్ కి ఓకే చెప్తుంది. ఛాన్సుల కోసం హాట్ హాట్ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే మలయాళంలో రెండు సినిమాలు ఓకే చేసింది. తెలుగులో కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుంది.

జయం, దొంగ దొంగది, అపరిచితుడు, ఔనన్నా కాదన్నా లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించిన సదా ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది. ఇప్పటికే టీవీ షోలలో జడ్జిగా, గెస్ట్ గా రావడం మొదలు పెట్టి సినిమాల్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అని చెప్తుంది. మంచి పాత్ర పడితే కచ్చితంగా మళ్ళీ సినిమాల్లోకి వస్తా అంటుంది.

ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగువారిని మెప్పించిన భూమిక మధ్యలో గ్యాప్ తీసుకొని ఆల్రెడీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇప్పటికే పలు సినిమాల్లో అక్క, వదిన క్యారెక్టర్స్ తో మెప్పిస్తుంది భూమిక. మరిన్ని సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంది భూమిక.

ప్రియమైన నీకు, వెంకీ, శ్రీరామదాసు, సంక్రాంతి లాంటి సినిమాలతో తెలుగులో అలరించిన స్నేహ ఇప్పటికే అక్క, వదిన క్యారెక్టర్స్ తో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది. మరిన్ని క్యారెక్టర్స్ వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉంది.

Pooja Hegde : మరో ఐటెం సాంగ్‌కి ఓకే చెప్పనున్న పూజాహెగ్డే??

సత్యం, సై, రెడీ, ఢీ, బొమ్మరిల్లు, ఆరెంజ్.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు వారికి బాగా దగ్గరైన హీరోయిన్ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేష్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరమైంది జెనీలియా. మధ్య మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినా తాజాగా ఓ మరాఠీ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించబోతుంది. తెలుగులో కూడా మంచి పాత్రలు వస్తే ఇక్కడ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అంటుంది ఈ హాసిని. మరియు ఈ భామలందరికి కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.