Ajay Devgn : షూటింగ్ మొదలుపెట్టిన హిందీ ‘దృశ్యం 2’

అజయ్ దేవగణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా హిందీలో 'దృశ్యం' సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'దృశ్యం 2' కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా హిందీ 'దృశ్యం 2' సినిమా.........

Ajay Devgn : షూటింగ్ మొదలుపెట్టిన హిందీ ‘దృశ్యం 2’

Drushyam

Ajay Devgn :  మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమా భారీ విజయం సాధించింది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమా అందరిని మెప్పించి దేశంలోని అనేక భాషల్లోకి రీమేక్ కూడా అయింది. తెలుగులో కూడా వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్ గా ‘దృశ్యం 2’ కూడా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ‘దృశ్యం 2’ కూడా వేరే భాషల్లోకి రీమేక్ అవుతుంది. తెలుగులో ఆల్రెడీ రీమేక్ అయి రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. తాజాగా హిందీలో రీమేక్ అవ్వనుంది.

Kajol : 12 కోట్లతో రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన కాజోల్‌.. 

అజయ్ దేవగణ్ హీరోగా, శ్రియ హీరోయిన్ గా హిందీలో ‘దృశ్యం’ సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘దృశ్యం 2’ కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా హిందీ ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అజయ్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. అయితే గతంలో హిందీ ‘దృశ్యం’ సినిమా తెరకెక్కించిన నిషికాంత్ కామత్ మరణించడంతో ఈ సారి ‘దృశ్యం 2’ సినిమాని మరో దర్శకుడు అభిషేక్‌ పాఠక్‌ తెరకెక్కిస్తున్నారు.