HIT 2: న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న అడివి శేష్.. ఇక్కడ కాదు అక్కడ!

టాలీవుడ్‌లో తెరకెక్కిన మర్డర్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ వర్స్‌లో రెండో సినిమాగా తెరకెక్కించిన హిట్-2 మొదట్నుంచీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ తరువాత ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

HIT 2: న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న అడివి శేష్.. ఇక్కడ కాదు అక్కడ!

HIT 2 Hindi Version Release Date Locked

HIT 2: టాలీవుడ్‌లో తెరకెక్కిన మర్డర్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ వర్స్‌లో రెండో సినిమాగా తెరకెక్కించిన హిట్-2 మొదట్నుంచీ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ తరువాత ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

HIT 2: కన్ఫం.. హిట్ 2 వచ్చేది ఆ రోజునే!

రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఇప్పుడు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. హిట్-2 సినిమాను హిందీ వెర్షన్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. హిట్-2 సినిమా యూనివర్సల్ సబ్జెక్ట్ అని.. ఇది నార్త్ బెల్ట్ ఆడియెన్స్‌ను బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతేగాక, మేజర్ సినిమాతో అడివి శేష్, నార్త్ ఆడియెన్స్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడని.. అందుకే ఈ సినిమాను కూడా అక్కడ రిలీజ్ చేస్తే, ఖచ్చితంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

HIT 2: హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో జెట్ స్పీడుగా దూసుకొస్తున్న అడివి శేష్ మూవీ!

దీంతో ఈ సినిమాను డిసెంబర్ 30న హిందీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుహాస్ కీలక పాత్రలో నటించాడు. మరి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్న హిట్-2 మూవీ నార్త్ ఆడియెన్స్‌ను ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.