HIT 2 Teaser: టీజర్ డేట్ అనౌన్స్ చేసిన ‘హిట్-2’ డైరెక్టర్.. హాలీవుడ్ స్థాయిలో హిట్ వర్స్!

టాలీవుడ్‌లో సస్పెన్స్ కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్-ది ఫస్ట్ కేస్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా హిట్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్ర యూనిట్, తాజాగా టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

HIT 2 Teaser: టీజర్ డేట్ అనౌన్స్ చేసిన ‘హిట్-2’ డైరెక్టర్.. హాలీవుడ్ స్థాయిలో హిట్ వర్స్!

HIT 2 Teaser Date Announced By Director

HIT 2 Teaser: టాలీవుడ్‌లో సస్పెన్స్ కాప్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘హిట్-ది ఫస్ట్ కేస్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో, ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఆ సినిమాలోనే సీక్వెల్ గురించి క్లూ ఇచ్చారు చిత్ర యూనిట్.

Hit2 Teaser: హిట్2 టీజర్ పై నాని అప్డేట్.. ఏమన్నాడంటే?

కాగా, ఇప్పటివరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తోనే ‘హిట్ 2’ మూవీపై ఆసక్తిని పెంచుతూ వచ్చిన చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమా టీజర్ గురించిన ఓ సాలిడ్ అప్డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమా దర్శకుడు శైలేష్ వైవిధ్యంగా ‘హిట్ వర్స్’ అనే ప్రపంచాన్ని ప్రేక్షకులకు వివరిస్తూ.. హిట్-1, హిట్-2 చిత్రాల గురించి చెబుతూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు. ఇక హిట్-3 గురించి కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా, హీరో అడివి శేష్ వచ్చి.. హిట్ 2 రిలీజ్ కాకుండానే, హిట్ 3 గురించి చెప్పేస్తావా అంటూ ప్రశ్నించాడు.

HIT The Second Case: కేసు పరిష్కరించి నానికి రెండో “హిట్” ఇస్తానంటున్న అడివి శేషు.. హిట్-2 అప్‌డేట్ వచ్చేసింది!

దీంతో హిట్-2 టీజర్ డేట్ ఎప్పుడో చెప్పేయమని హీరో అడగ్గా, నవంబర్ 3న హిట్-2 టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర డైరెక్టర్ ప్రకటించాడు. మొత్తానికి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హిట్-2 టీజర్ రిలీజ్ డేట్‌ను ఎట్టకేలకు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఈ హిట్ వర్స్ అనే కాన్సెప్ట్‌లో ఇంకా ఎన్ని భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడో అని దర్శకుడు శైలేష్ కొలనుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తుండగా, ఎంఎం.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక డిసెంబర్ 2న హిట్-2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.