Allu Arjun: బాలీవుడ్ స్టార్‌తో ఐకాన్ స్టార్ మల్టీస్టారర్?

టాలీవుడ్.. బాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోల సినిమాలు తీసేయడం చాలా కామన్ అయిపోతుంది.

Allu Arjun: బాలీవుడ్ స్టార్‌తో ఐకాన్ స్టార్ మల్టీస్టారర్?

Allu Arjun

Allu Arjun: టాలీవుడ్.. బాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోల సినిమాలు తీసేయడం చాలా కామన్ అయిపోతుంది. అయితే.. ఒకరు టాలీవుడ్, మరొకరి బాలీవుడ్ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా అంటే అది ఇంకో మెట్టు ఎక్కినట్లే. అలాంటి ఓ సినిమాకి ఇప్పుడు పునాది పడుతుందని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో బాలీవుడ్ స్టార్ తో ఈ మల్టీస్టారర్ చేయనున్నాడని టాక్.

Telugu Heroin’s: ఎక్కడ ఆఫర్ వస్తే.. అక్కడ వాలిపోతున్న హీరోయిన్లు!

తాజాగా జెర్సీ హిందీ ట్రైలర్ లాంచ్ రీసెంట్‌ జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మూవీ టీంతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్.. మీడియా, ప్రేక్షకులు కూడా హాజరయ్యారు. ఈ క్ర‌మంలో మీడియా బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారా అని అల్లు అరవింద్ ని ప్రశ్నించింది. దానికి ఆయన నో అని చెప్పకుండానే.. ఇది చెప్పే స‌మ‌యం కాదు, స‌రైన స్థ‌లంలో దాని గురించి చెబుతానని అన్నాడు. దీంతో టాలీవుడ్-బాలీవుడ్ హీరోల మల్టీస్టారర్ అంటూ కథనాలు మొదలయ్యాయి.

Bigg Boss 5: ఇంటి చివరి కెప్టెన్‌గా షణ్ముక్.. పక్కా ప్లాన్ వేసి మరీ!

అది కూడా ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్, అల్లు అర్జున్ తో ఈ మల్టీస్టారర్ ఉండొచ్చని.. బాలీవుడ్ మరో ప్రొడక్షన్ హౌస్ తో కలిసి అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించనున్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోయినా అల్లు అరవింద్ నో చెప్పకపోవడంతో ఊహాగానాలను ఊపిరి పోసినట్లయింది. ఏమో గుర్రం ఎగరావచ్చు.. కానీ.. దీనికి సమయం పట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఫుల్ బిజీగానే ఉన్నారు.