Indian-2 Movie: ‘ఆర్ఆర్ఆర్’ను మించి వస్తోన్న ఇండియన్-2.. ఆడియెన్స్ ఏమంటారో?

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కించగా, తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ మూవీని తెరకెక్కించాలని శంకర్ ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీక్వెల్ మూవీని అఫీషియల్‌గా ప్రారంభించారు చిత్ర యూనిట్.

Indian-2 Movie: ‘ఆర్ఆర్ఆర్’ను మించి వస్తోన్న ఇండియన్-2.. ఆడియెన్స్ ఏమంటారో?

Indian-2 Movie To Have Lengthy Runtime Than RRR

Indian-2 Movie: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కించగా, తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ మూవీని తెరకెక్కించాలని శంకర్ ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సీక్వెల్ మూవీని అఫీషియల్‌గా ప్రారంభించారు చిత్ర యూనిట్.

Indian 2: త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!

అయితే ఈ సినిమాకు పలు అవాంతరాలు ఎదురవుతూ వస్తున్నా, చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను సెప్టెంబర్ 3వ వారంలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రన్‌టైమ్ సాధారణ రెగ్యులర్ చిత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్-2 మూవీ రన్‌టైమ్ ఏకంగా 3 గంటల 10 నిమిషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Indian 2: భారతీయుడి కష్టాలు.. చెర్రీకి చిక్కులు?

ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా మూవీ కూడా మూడు గంటలకుపైగా రన్‌టైమ్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఇండియన్-2 కూడా ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌తో వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.