Lakshmi Manchu: గాయాలపాలైన మంచు లక్ష్మి.. అసలేం జరిగిందంటే?

కలెక్షన్ కింగ్ మంచువారమ్మాయి లక్ష్మి ఎన్ని విమర్శలు ఎదురైనా ఆమె అనుకున్న దాన్ని అనుకున్నట్లు ఆచరిస్తూ ముందుకెళ్తుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్ గా, సోషల్ మీడియా..

Lakshmi Manchu: గాయాలపాలైన మంచు లక్ష్మి.. అసలేం జరిగిందంటే?

Lakshmi Manchu (1)

Lakshmi Manchu: కలెక్షన్ కింగ్ మంచువారమ్మాయి లక్ష్మి ఎన్ని విమర్శలు ఎదురైనా ఆమె అనుకున్న దాన్ని అనుకున్నట్లు ఆచరిస్తూ ముందుకెళ్తుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్ గా, సోషల్ మీడియా సెలబ్రిటీగా ఎప్పుడో ఏదోఒక పని చేస్తూ బిజీబిజీగా గడిపేస్తూనే ఉంటుంది. కాగా.. మంచు లక్ష్మి ప్రస్తుతం మోహన్ లాల్ తో కలిసి ఓ మలయాళ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. అయితే.. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో చేతి వేళ్ళకి మోకాలికి గాయాలైన వీడియోలను పోస్ట్ చేసింది.

Pushpa: రెండో రోజు అదే వసూళ్లు.. బాక్సాఫీస్ దగ్గర తగ్గని ఐకాన్ జోరు!

లక్ష్మి చేతి వేళ్ళపై గాయాలను చూసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందని అందుకే గాయాలయ్యాయని అనుకున్నారు. కొందరైతే లక్ష్మికి ఏదో ప్రమాదం జరిగిందని స్వయంగా ఆమెనే ప్రశ్నించారు. దీంతో స్పందించిన మంచు లక్ష్మి అసలు విషయాన్ని వెల్లడించింది. ఆ గాయాలు ప్రమాదం వలన జరిగిందని కాదని.. సినిమా కోసం కేవలం మేకప్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. మలయాళం సినిమా షూటింగ్ లో భాగంగా ఓ సీన్ కోసం చేసుకున్న మేకప్ మాత్రమేనని చెప్పుకొచ్చింది.

Bheemla Nayak: సంక్రాంతికి రావాలా వద్దా.. చర్చిస్తున్న మేకర్స్?

తనపై చూపిస్తున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేసిన లక్ష్మి.. అది నిజంగా జరిగిన యాక్సిడెంట్‌ కాదని.. కేవలం ఓ షూటింగ్‌లో భాగంగా తీసిన స్టిల్స్‌ అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే, దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. షూటింగ్ కోసం చేసుకున్న మేకప్ అయినపుడు అవి నిజమైన గాయలలాగా పోస్ట్ చేసి నొప్పి నటించడం ఎందుకని కొందరు విమర్శలు చేస్తున్నారు. సానుభూతి కోసం ఇలా ఫేక్ వీడియోలు పెట్టడం ఎందుకని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.