‘సీనయ్య’గా వి.వి.వినాయక్ లుక్ చూశారా!

డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా పరిచయం చేస్తూ, నరసింహ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్).. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 8, 2019 / 11:58 AM IST
‘సీనయ్య’గా వి.వి.వినాయక్ లుక్ చూశారా!

డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా పరిచయం చేస్తూ, నరసింహ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్).. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్..

డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా పరిచయమవుతున్నారు. ఇప్పటి వరకు దర్శకుడిగా తెర వెనక యాక్షన్ చెప్పిన వినయ్.. ఇప్పుడు మరో దర్శకుడు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నారు. ‘ఠాగూర్’, ‘ఖైదీ నెం:150’ సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్న వినాయక్‌ను పూర్తిస్థాయి హీరోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, లాంచ్ చేస్తున్నారు. అక్టోబర్ 9న వినాయక్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేశారు.

‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరో లుక్‌లో వినాయక్ అదిరిపోయాడు.. వినయ్ ఈ సినిమాలో రైతుగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి.. కట్ చేస్తే ఫస్ట్ లుక్‌లో ఆయన మెడలో ఎర్ర కండువాతో.. పెద్ద రెంచీ పట్టుకుని ఉన్నారు. గ్యారేజ్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మెకానిక్‌గా కనిపించనున్నారని అర్థమవుతుంది.

Read Also : కొత్త సినిమాలు – దసరా శుభాకాంక్షలు

త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. కెమెరా : సాయి శ్రీరామ్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, మాటలు : డార్లింగ్ స్వామి, ఆర్ట్ : కిరణ్ కుమార్, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి.