Pawan Kalyan: నిజమా కదా.. భీమ్లా బ్యాచ్‌తోనే పవర్ మరో రీమేక్?

పవర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఓ సూపర్ రూమర్ వినిపిస్తోంది. భీమ్లానాయక్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన పవన్.. ప్రస్తుతం టార్గెట్ హరిహర వీరమల్లు అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్..

Pawan Kalyan: నిజమా కదా.. భీమ్లా బ్యాచ్‌తోనే పవర్ మరో రీమేక్?

Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఓ సూపర్ రూమర్ వినిపిస్తోంది. భీమ్లానాయక్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన పవన్.. ప్రస్తుతం టార్గెట్ హరిహర వీరమల్లు అంటున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాని లైన్ లో పెట్టారు. కానీ ఈలోపే మరో ప్రాజెక్ట్ ను పవన్ పట్టాలెక్కించబోతున్నరానే న్యూస్ ట్రెండ్ అవుతోంది. అది కూడా భీమ్లా నాయక్ బ్యాచ్ తోనే అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

Pawan Kalyan : తన డైరెక్టర్స్‌తో పవర్ స్టార్.. వైరల్ అవుతున్న ఫొటో..

పవర్ స్టార్ మళ్లీ రీమేక్ అంటున్నారు.. త్రివిక్రమ్ కథ రెడీ చేస్తున్నారు.. సాగర్ చంద్ర డైరెక్ట్ చేయబోతున్నాడు.. పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై వినిపిస్తున్న గాసిప్స్ ఇవి. అవును భీమ్లానాయక్ బ్యాచ్ అంతా కలిసి వినోదయ సిత్తం అనే తమిళ్ మూవీని రీమేక్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ఈ సినిమాలో సముద్రఖని నటించి.. డైరెక్ట్ చేశారు. ఇప్పుడీ క్రేజీ సినిమాపై పవన్ – త్రివికమ్ మనసు పారేసుకున్నట్టు తెలుస్తోంది.

Pawan Kalyan : ఒక్కరోజులోనే 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్.. అమెరికాలో భీమ్లా నాయక్ కాసుల వర్షం..

వినోదయ సిత్తం సినిమాకు గానూ పవన్ 20 రోజులు డేట్స్ కేటాయించినట్టు.. ఆ 20డేస్ కు సుమారు 50కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం. ఇక ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో సాయిధరమ్ తేజ్ కనిపించే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మన నేటివిటీకి తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే ను రెడీ చేస్తున్నట్టు.. తాను డైరెక్ట్ చేయబోయే మహేశ్ మూవీతో పాటూ పవన్ సినిమా కోసం వర్క్ చేస్తారని టాక్. సాగర్ చంద్ర లేదంటే ఒరిజనల్ డైరెక్టర్ సముద్రఖనినే ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే అవకాశముంది. అన్నీ నిజమైతే మార్చ్ 25న పవన్ కొత్త రీమేక్ పట్టలెక్కబోతున్నట్టు కూడా తెలుస్తోంది.

Pawan kalyan : సినిమానే నాకు అన్నం పెట్టింది.. సినిమా తప్ప నాకు ఇంకోటి తెలీదు..

వారం కాకముందే 150కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ కొట్టేసాడు భీమ్లానాయక్. నెక్ట్స్ క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లును పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత డైరెక్టర్ హరీశ్ శంకర్.. భవదీయుడు భగత్ సింగ్ కోసం ఆయన డేట్స్ అడ్జస్ట్ చేస్తారు. ఈ సినిమాల గ్యాప్ లోనే వినోదయ సిత్తం పూర్తి చేయాలనేది పవన్ ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడి రాజకీయాలతో మళ్లీ బిజీఅయ్యే లోపు వీలైనన్ని సినిమాలు చేయాలనుకుంటున్న పవర్ స్టార్.. వినోదయ సిత్తంను ఒకవేళ ప్రకటించినా ఆశ్చర్యం లేదు.