Pawan kalyan : సినిమానే నాకు అన్నం పెట్టింది.. సినిమా తప్ప నాకు ఇంకోటి తెలీదు..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''జై తెలంగాణ.. జై ఆంధ్ర.. జై భారత్.. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, చెన్నై నుంచి వచ్చిన నా గుండె చప్పుళ్ళు అయిన నా అభిమానులకి, నా ఆడ పడుచులకి నా.......

Pawan kalyan : సినిమానే నాకు అన్నం పెట్టింది.. సినిమా తప్ప నాకు ఇంకోటి తెలీదు..

Pawan

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘భీమ్లా నాయక్’ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 23న బుధవారం సాయంత్రం హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది.

 

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ”జై తెలంగాణ.. జై ఆంధ్ర.. జై భారత్.. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, చెన్నై నుంచి వచ్చిన నా గుండె చప్పుళ్ళు అయిన నా అభిమానులకి, నా ఆడ పడుచులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రోగ్రాం లో ఎక్కడన్నా మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవగానే వచ్చిన కేటీఆర్ కి ధన్యవాదాలు. కేటీఆర్ ని నేను ఆప్యాయంగా రామ్ భాయ్ అని పిలుస్తాను. చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఇమడవు. ఇక్కడ కళాకారులు ఉంటారు. కులాలు, మతాలకి అతీతంగా చెన్నైలో ఉన్న పరిశ్రమని ఇక్కడ హైదరాబాద్ కి తీసుకురావడానికి ఎంతో మంది పెద్దలు కష్టపడ్డారు. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సినీ పరిశ్రమ మరింత ముందుకి తీసుకు వెళ్తునందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడు అవసరం వచ్చినా చిత్ర పరిశ్రమ కష్ట నష్టాలు అర్ధం చేసుకొని సహాయం చేస్తునందుకు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి కృతజ్ఞతలు.”

KTR : భారత సినీ పరిశ్రమకి హైదరాబాద్‌ని హబ్‌గా చేస్తున్నాము.. మీ పేరు చెపితే అరుపులే..

”జన జీవితంలో ఉన్నా నాకు సినిమానే అన్నం పెట్టింది. సినిమా నాకు ఇంతమంది అభిమానులని ఇచ్చింది. నాకు ఇవన్నీ ఇచ్చినందుకు ఎంతో కొంత చేయాలి సమాజానికి. నాకు వేరే వృత్తి తెలీదు. సినిమానే నాకు డబ్బులు ఇస్తుంది. రాజకీయాల్లో ఉన్నా ఇప్పటికి కూడా అదే భాద్యతగా సినిమా చేస్తున్నా. టెక్నిషియన్స్ అంతా బాగా కష్టపడి సినిమాని బాగా తీశారు. నా పొలిటికల్ షెడ్యూల్ కి అనుగుణంగా డేట్స్ మార్చుకొని నాకు సపోర్ట్ చేశారు. డైరెక్టర్ అమెరికాలో ఎక్కడో చదువుకుంటూ సినిమా మీద ప్రేమతో నల్గొండ మారుమూల నుంచి వచ్చి మంచి డైరెక్టర్ అయినందుకు శుభాకాంక్షలు.”

Rana : పవన్ కళ్యాణ్ గారికంటే నేనే ముందు సెలెక్ట్ అయ్యాను ఈ సినిమాలో

” నేను మారుమూల ప్రాంతాల్లో కళాకారులని చూసాను. అలాంటి కళాకారులని తమన్ ద్వారా బయటకి తీసుకొచ్చినందుకు ఆనందంగా ఉంది. మొగిలయ్య లాంటి వారిని గుర్తించినందుకు, ఆయనతో పాడించినందుకు తమన్ గారికి కృతజ్ఞతలు. అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య ఒక మడమ తప్పని యుద్ధం ఈ సినిమా. మలయాళం సినిమా ‘అయ్యప్పన్ కోషియమ్’ కి ఇది రీమేక్. పోలీస్, రాజకీయంకి మధ్య జరిగిన సంఘర్షణ కథని మంచిగా రాసినందుకు త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. త్రివిక్రమ్ ఈ సినిమాకి వెన్నుముక. ఆయన ముందుండి అందర్నీ నడిపించారు. రానా అద్భుతమైన నటనతో సహకారం అందించారు. సంయుక్త మీనన్ కి శుభాకాంక్షలు, సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ అద్భుతంగా విజువల్స్ చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ఎడిటర్ నవీన్ నూలి, సినిమాకి పని చేసిన అందరికి ధన్యవాదాలు. ఈ సినిమా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమా కోసం నేను కష్టపడతాను. మీరే ఆదరించాలి. జైహింద్.” అని తెలిపారు.