Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా.. బండ్ల మళ్ళీ అదే డైలాగ్!

ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన స్పీచ్ మెగా అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఈ స్పీచ్ లో బండ్ల ఎమోషన్ పీక్స్ కి చేరి ఎమోషన్స్ కామెడీగా మారిపోవడంతో పవన్ కళ్యాణ్ తో సహా ఆ వేదిక ముందున్న సెలబ్రిటీలందరూ స్పీచ్ జరుగుతున్నంత సేపు విరగబడి నవ్వుతూ ఉండిపోయారు.

Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా.. బండ్ల మళ్ళీ అదే డైలాగ్!

Pawan Kalyan

Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన స్పీచ్ మెగా అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఈ స్పీచ్ లో బండ్ల ఎమోషన్ పీక్స్ కి చేరి ఎమోషన్స్ కామెడీగా మారిపోవడంతో పవన్ కళ్యాణ్ తో సహా ఆ వేదిక ముందున్న సెలబ్రిటీలందరూ స్పీచ్ జరుగుతున్నంత సేపు విరగబడి నవ్వుతూ ఉండిపోయారు.

ఇక సోషల్ మీడియాలో ఈ స్పీచ్ మీద పుట్టుకొచ్చిన మీమ్స్, కొటేషన్స్ కు కొదువే లేదు. అయితే.. బండ్ల గణేష్ అప్పటికి ఇప్పటికీ చెప్పేది పవన్ కళ్యాణ్ మా దేవుడనే. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేయడంతో పాటు మరోసారి ఈశ్వరా.. పవనేశ్వరా అంటూ డైలాగ్ చెప్పాడు. ఓ టీవీ షోలో పాల్గొన్న బండ్ల మరోసారి పవన్ కళ్యాణ్ గురించి డైలాగ్ తో అదరగొట్టాడు.

ప్రస్తుతం ఈ ప్రోమో ఛానెల్ లో చక్కర్లు కొడుతుండడగా చూసేందుకు ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి సినిమా రిలీజ్ అయితే కానీ బండ్ల మళ్ళీ కామెడీ చేశాడా.. లేక సీరియస్ నిలబెట్టడా అన్నది చూడాలి. ఇక ఈ షోలో బండ్లతో పాటు యానీ మాస్టర్, నందిత శ్వేత, జియా వారి వారి పిల్లలతో వచ్చి సందడి చేశారు.