Sunil : రాజా రవీంద్రతో నాకు ఎలాంటి గొడవ అవ్వలేదు.. కాని.. : సునీల్

రాజా రవీంద్ర ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. ''నన్ను మేనేజర్‌‌గా ఎందుకు తీసేశాడో సునీల్‌నే అడగండి. హీరో నుంచి విలన్ రోల్, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో.....

Sunil : రాజా రవీంద్రతో నాకు ఎలాంటి గొడవ అవ్వలేదు.. కాని.. : సునీల్

Sunil Raja Ravindra

Sunil :    ఇండస్ట్రీలో చాలా మందికి మేనేజర్లు ఉంటారు. వాళ్ళకి ఆఫర్స్ తెప్పించడానికి, వాళ్ళ డేట్స్ చూడటానికి మేనేజర్స్ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉన్న కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ యాక్టింగ్స్ చూసుకుంటూనే వేరే వాళ్ళకి మేనేజర్స్ గా వర్క్ చేస్తారు. అందులో రాజా రవీంద్ర ఒకరు. గతంలో రాజా రవీంద్ర రవితేజ, నిఖిల్, రాజ్ తరుణ్, సునీల్.. ఇలా చాలా మంది హీరోలకి, ఫేమస్ ఆర్టిస్టులకి మేనేజర్ గా ఉండేవాడు. అయితే ప్రస్తుతం కొంతమందికి మాత్రమే మేనేజర్ గా ఉంటున్నాడు. తాజాగా ఆయన సునీల్ కి మేనేజర్ గా తప్పుకున్నట్టు వెల్లడించారు.

 

రాజా రవీంద్ర ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. ”నన్ను మేనేజర్‌‌గా ఎందుకు తీసేశాడో సునీల్‌నే అడగండి. హీరో నుంచి విలన్ రోల్, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. నేను బిజీగా ఉండటంతో నన్ను ఒత్తిడి చేయడం ఎందుకులే అని, పర్సనల్ అటెన్షన్ ఉంటే బాగుండు అని ఫీల్ అయి నన్ను తీసేసాడేమో. కొన్ని విషయాల్లో సునీల్ ఫీల్ అయ్యాడు. అన్నా కొంచెం గ్యాప్ తీసుకుంటా అని అన్నాడు. అంతకు మించి నాకు ఏం చెప్పలేదు కాని నాకు ఇలా అర్ధమైంది అందుకే సునీల్ మేనేజర్‌గా తప్పుకున్నాను” అని తెలిపాడు.

Prabhas : జపాన్‌లో ప్రభాస్ బాటిల్స్.. పెద్ద సంస్థే ప్రభాస్ ఫొటోని వాడేస్తుందిగా

అయితే ఈ విషయంపై తాజాగా సునీల్ స్పందించారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలో మంగళం శీనుగా నెగిటివ్ రోల్‌లో అలరించిన సునీల్ సినిమా సక్సెస్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో దీని గురించి మాట్లాడాడు. సునీల్ మాట్లాడుతూ.. ‘క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేస్తాను. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడను మంచి రోల్ ఉంటే ఎవరైనా నన్ను కలవొచ్చు. రాజా రవీంద్రని నేను మేనేజర్‌గా తీసేయలేదు. అతనితో మంచి రిలేషన్ ఉంది. అతను నాకు బంధువు కూడా. నా అంతట నేను ఇండస్ట్రీ వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యి నేను వచ్చిన కొత్తలో ఎలాగైతే అవకాశాలు వెతుకున్నానో మళ్లీ అలాగే డైరెక్ట్‌గా నాకు నచ్చిన పాత్రల్ని నేను ఎంచుకుని సినిమాలు చేయాలని అనుకున్నాను. నా ప్రయాణం కష్టమైనా నష్టమైనా నేనే భరించాలని అని అనుకున్నాను” అని తెలిపారు.

Samantha : వెబ్ సిరీస్ చేస్తాననుకోలేదు.. వాళ్ళ వల్లే చేసాను : సమంత

”ఆ ఉద్దేశ్యంతోనే నా సినిమాలు నేనే చూసుకుంటున్నాను. రాజా రవీంద్ర నాకు అన్నయ్య లాంటి వాడు. మా మధ్య ఎలాంటి గొడవలు అవ్వలేదు కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, చాలామంది నన్ను డైరెక్ట్‌గా అప్రోచ్ అవుతున్నారు. ఆయన ద్వారా అప్రోచ్ అయిన వాళ్లకి రెస్పాండ్ కాకపోతే మా ఇద్దరి మధ్య ఇబ్బంది వస్తుంది. ఈ కన్ఫ్యూజన్‌లో నా వల్ల నువ్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నావ్ రా తమ్ముడూ అని ఆయనే అన్నారు. అందుకే నా హ్యాండ్ ఎలా ఉంటుందో చూద్దాం అని కొంతకాలంగా నా సినిమాలను నేనే చూసుకుంటున్నాను” అని చెప్పారు సునీల్.