Evaru MeeloKoteeswarulu : ‘మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’..

వినోదం, విజ్ఞానంతో పాటు ఎమోషనల్‌గానూ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఉండబోతోంది..

10TV Telugu News

Evaru MeeloKoteeswarulu: ‘ఇక్కడ కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు’.. అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఆగస్టులోనే బుల్లితెర మీద సందడి చెయ్యబోతున్నారు. ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ తర్వాత తారక్ హోస్ట్ చేస్తున్న ఈ క్రేజీ రియాలిటీ షోపై భారీ అంచనాలున్నాయి..

RRR : మెగా – నందమూరి ‘దోస్తీ’.. సోషల్ మీడియా షేక్ అవుతోంది..!

120 దేశాల్లో కామన్ మ్యాన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పాపులర్ షో ను ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. ఇప్పటికే స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ప్రోమోస్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది.

Jr.Ntr : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం ఎన్టీఆర్ వేసుకున్న బ్లేజర్ రేటు ఎంతంటే…

ఆదివారం రిలీజ్ చేసిన కొత్త ప్రోమో ఎమోషనల్‌గా ఉండడంతో పాటు షో మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల జాబ్ పోగొట్టుకున్న లెక్చరర్, టిఫిన్ బండి పెట్టుకోవడం, స్టూడెంట్స్ పస్తులుండ కూడదని అప్పుగా టిఫిన్ పెట్టడం, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లో పాల్గొని పాతిక లక్షలు గెలుచుకుని.. ఆ డబ్బులో కొంత, ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న తన స్టూడెంట్స్‌కి సాయం చేస్తానని, మిగతావి ఇంట్లో ఖర్చులకు వాడుకుంటానని చెప్పడం.. హోస్ట్ అప్రిషియేట్ చేస్తూ.. ‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’ అనడంతో ప్రోమో బాగా కనెక్ట్ అయ్యింది.

వినోదం, విజ్ఞానంతో పాటు ఎమోషనల్‌గానూ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఉండబోతోంది. సూట్లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్లో తారక్ లుక్ బాగుంది. మరికొద్ది రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కంప్లీట్ చేసేసి, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ బ్యాలెన్స్ ఎపిసోడ్స్ పూర్తి చెయ్యనున్నారు యంగ్ టైగర్. ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షో ఆగస్టులోనే టెలికాస్ట్ కానుంది.

10TV Telugu News