RRR: తారక్ పర్ఫామెన్స్ పీక్స్.. కొమురం భీముడో వీడియో సాంగ్ రిలీజ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

RRR: తారక్ పర్ఫామెన్స్ పీక్స్.. కొమురం భీముడో వీడియో సాంగ్ రిలీజ్

Rrr

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు మేటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాను చూసేందుకు అన్ని భాషల ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక వసూళ్ల పరంగా కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మెస్మరైజ్ చేయగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.

Komuram Bheemudo Lyrics: రక్తం మరిగించే ‘కొమురం భీముడో’ పాట.. లిరిక్స్, వాటి అర్థం తెలుసుకోండి!

RRR: చౌరస్తాలో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఇప్పట్లో కష్టమే!

ఇక ఈ సినిమా నుండి వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్, తాజాగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కొమురం భీముడో’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న వాటిలో ఈ పాట కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. ఈ పాటలో హీరోల ఎక్స్‌ప్రెషన్స్.. ముఖ్యంగా తారక్ ఈ పాటలో తన నటవిశ్వరూపాన్ని చూపించాడని అభిమానులతో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఆయన యాక్టింగ్‌కు సెల్యూట్ చేశారు.

RRR-KGF2: కలెక్షన్ల సునామి.. దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు!

ఈ పాట కాంటెక్స్ట్ లోకి వెళ్తే.. కొమురం భీముని చర్మం చిట్లిపోయేలా కొడుతుంటే, చూస్తున్న ప్రతొక్కరికి రక్తం సల సల సల మరిగిపోతూ ఉంటుంది. ఆ బ్రిటిషర్లని చూస్తే ప్రతి కణం నిప్పు కణికలై తగలబెట్టెయ్యలన్నంత కోపం వస్తుంది. ఆ ప్రజలలో కోపం, కరుణ, జాలీ కనిపిస్తాయి. బ్రిటీషర్ల ముందు ఎట్టి పరిస్థితుల్లోను మొకరిల్ల కూడదని గట్టి సంకల్పంతో భీమ్ ఉంటాడు. రామ్ తన లక్ష్యం కోసం తప్పని కర్తవ్యంతో చేతులు కట్టబడి, ధర్మానికి కట్టుబడి, తన మనస్సుని చంపుకుని ప్రతి దెబ్బ కొడుతుంటాడు.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవెర్ బిఫోర్ రికార్డ్.. హైదరాబాద్‌లో 46 సెంటర్లలో రూ.46 కోట్లు!

సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను కీరవాణి స్వరపరిచగా.. ఆయన కొడుకు కాలభైరవ ప్రాణం పెట్టి పాడాడు. బానిస బతుకులు.. స్వేచ్ఛా పోరాటం.. పోరాట కాంక్ష.. రగిలే ఆవేశం.. ఇవన్నింటినీ హైలైట్ చేస్తూ.. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు వాడే లోకల్ పదాలతో సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారు. అద్భుతమైన పదాలను వాడుతూ కొమురం భీమ్ తెగువను చాటారు రైటర్. కొర్రాయి, నెగడు, కాల్మొక్తా బాంచెన్ లాంటి పదాలతో ప్రత్యేకత చూపించారు. ఇక ఈ పాటలో హీరోలిద్దరూ పోటీపడి నటించగా.. ఎన్టీఆర్ నట విశ్వరూపం పాటను సినిమాకే హైలెట్ చేసింది.

Komuram Bheemudo Lyrics: రక్తం మరిగించే ‘కొమురం భీముడో’ పాట.. లిరిక్స్, వాటి అర్థం తెలుసుకోండి!