Simhadri Re-Release: రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న సింహాద్రి.. రికార్డులకు ఎసరుపెట్టిన తారక్ ఫ్యాన్స్!

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Simhadri Re-Release: రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న సింహాద్రి.. రికార్డులకు ఎసరుపెట్టిన తారక్ ఫ్యాన్స్!

Jr NTR Simhadri Re-Release Works In Full Swing

Simhadri Re-Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ చాలా ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే అఫీషియల్‌గా లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరిపేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతోంది. అయితే, తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు తారక్ రెడీ అవుతున్నాడు.

Jr NTR : ఫ్యాన్ వార్‌కి ఫుల్ స్టాప్.. వైరల్ అవుతున్న ‘సింహాద్రి’ ఓపెనింగ్ ఫొటో..

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాజమౌళి తెరకెక్కించగా, తారక్ విధ్వంసకర పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని అందుకుని, తారక్ కెరీర్‌లో అప్పటివరకు ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కొరటాల..?

సింహాద్రి చిత్రానికి సంబంధించిన 4K రీ-మాస్టర్ ప్రింట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మూవీని 4కె అల్ట్రా హెచ్‌డితో పాటు 5.1 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీలో రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. భూమికా, అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. సింహాద్రి చిత్రాన్ని ఎప్పుడు రీ-రిలీజ్ చేస్తారా అనే విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.