Kangana Ranaut : పఠాన్ విజయానికి ఇండియా సెక్యులర్ కంట్రీ అంటూ ట్వీట్ చేసిన నిర్మాత.. కౌంటర్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్..

తాజాగా బాలీవుడ్ నిర్మాత ప్రియా గుప్తా పఠాన్ విజయాన్ని అభినందిస్తూ షారుఖ్, దీపికా, చిత్రయూనిట్ ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో.. షారుఖ్‌ను హిందువులు, ముస్లింలు సమానంగా ప్రేమిస్తారు. బాయ్‌కాట్‌ విమర్శలు సినిమాకు...................

Kangana Ranaut : పఠాన్ విజయానికి ఇండియా సెక్యులర్ కంట్రీ అంటూ ట్వీట్ చేసిన నిర్మాత.. కౌంటర్ ఇచ్చిన ఫైర్ బ్రాండ్..

Kangana Ranaut counter tweet to producer priya guptha tweet on Pathaan Success

Kangana Ranaut : షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత ఇటీవలే పఠాన్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. పాత కథే అయినా యాక్షన్ సన్నివేశాలు, కథనం బాగుండటంతో సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పట్లో ఏ సినిమా పరిశ్రమలో కూడా వేరే సినిమాలు రిలీజ్ లేకపోవడంతో పఠాన్ కి మరింత కలిసొచ్చింది. పఠాన్ సినిమాకి భారీగా కలెక్షన్స్ వచ్చాయి. నాలుగు రోజుల్లోనే 429 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.

పఠాన్ సినిమా విజయం, కలెక్షన్స్ పై బాలీవుడ్ సంబరపడుతుంది. షారుఖ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు బాయ్ కాట్ బాలీవుడ్ కి భయపడిన గ్యాంగ్ ఇప్పుడు బయటకి వచ్చి మాట్లాడుతుంది. పఠాన్ సినిమా బాలీవుడ్ పని అయిపొయింది అన్న వాళ్లందరికీ సమాధానం అని కొంతమంది బాలీవుడ్ వాళ్ళు అంటున్నారు. ఇక పఠాన్ విజయంపై ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందిస్తూ సోషల్ మెడిలో పోస్టులు చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ నిర్మాత ప్రియా గుప్తా పఠాన్ విజయాన్ని అభినందిస్తూ షారుఖ్, దీపికా, చిత్రయూనిట్ ని అభినందిస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ లో.. షారుఖ్‌ను హిందువులు, ముస్లింలు సమానంగా ప్రేమిస్తారు. బాయ్‌కాట్‌ విమర్శలు సినిమాకు నష్టం చేయవు పైగా సహాయపడతాయి. సినిమాలోని రొమాన్స్‌, మంచి సంగీతం మెప్పించాయి. ఇండియా సెక్యులర్‌ దేశం అనడానికి మరోసారి పఠాన్‌ సినిమా నిరూపించింది అని తెలిపింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారి వివాదానికి దారి తీసింది.

Pooja Hegde Brother Marriage : పూజాహెగ్డే అన్నయ్య వివాహం.. ఎమోషనల్ అయిన పూజ..

ప్రియా గుప్తా ట్వీట్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ కౌంటర్ ట్వీట్ చేసింది. కంగనా సమాధానమిస్తూ.. మీరు చెప్పింది చాలా మంచి విశ్లేషణ. ఈ దేశం కొన్ని సందర్భాల్లో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం నటీమణులపై ఇష్టం చూపిస్తుంది. అందుకే ఇండియాలో ద్వేషం, ఫాసిజం ఉన్నాయనడం చాలా అన్యాయం. ప్రపంచంలో భారత్‌ లాంటి దేశం మరొకటి లేదు అంటూ వ్యంగ్యంగా కౌంటర్ ట్వీట్ చేసింది.