Kangana Ranaut : చంద్రముఖి 2 కంగనా షూటింగ్ పూర్తి.. ఫస్ట్ టైం లారెన్స్‌తో ఫోటో తీసుకున్నా అంటూ కంగనా ఎమోషనల్ పోస్ట్
తాజాగా చంద్రముఖి 2 సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని కంగనా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్టులు చేసింది. లారెన్స్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ కంగనా................

Kangana Ranaut : రజినీకాంత్ చంద్రముఖి సినిమాకు చాలా ఏళ్ళ తర్వాత సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చంద్రముఖి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చంద్రముఖిగా కంగనా కనపడబోతుంది. కంగనాని చంద్రముఖి పాత్రకు ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు ఆమె చేయగలదా అని. కానీ శాస్త్రీయ నాట్యం మరింత నేర్చుకొని మరీ ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని సమాచారం. తాజాగా చంద్రముఖి 2 సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని కంగనా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్టులు చేసింది.
లారెన్స్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ కంగనా.. ఇవాళ్టితో చంద్రముఖి 2లో నా పాత్ర షూటింగ్ పూర్తయింది. నేను కలిసిన చాలా మంది వ్యక్తులకు బై చెప్పడం చాలా కష్టంగా ఉంది. లారెన్స్ మాస్టర్ గొప్ప డ్యాన్స్, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు మాత్రమే కాదు మంచి మనిషి కూడా. నన్ను సెట్ లో బాగా చూసుకున్నందుకు, నన్ను నవ్వించినందుకు, నా పుట్టిన రోజుకు బహుమతులు అందించినందుకు ధన్యవాదాలు సర్. మీతో పనిచేయడం చాలా గొప్ప విషయం అని పోస్ట్ చేసింది.
అలాగే సెట్ లో తనకు వీడుకోలు చెప్తూ కేక్ కట్ చేయించిన వీడియోని పోస్ట్ చేసి..ఒక చిత్ర యూనిట్ గా నేను అద్భుతమైన వ్యక్తులని కలిసాను. మన చిత్ర యూనిట్ మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా అవుతారు. అందరం కలిసి పనిచేస్తాం. సడెన్ గా ఆ పని అయిపోయింది అని వదిలి వెళ్ళేటప్పుడు అంత సులభం కాదు. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు నాకు కన్నీళ్లు ఆగట్లేదు అని పోస్ట్ చేసింది.
Avinash Kolla : దసరా సినిమా కోసం 22 ఎకరాల్లో ఊరి సెట్.. అదంతా నిజం కాదా?
ఇక కంగనా లారెన్స్ గురించి చేసిన పోస్ట్ కి లారెన్స్ రిప్లై ఇస్తూ.. చాలా థ్యాంక్స్ మేడం. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన మీ ప్రయాణం స్ఫూర్తి దాయకం. 20 రోజుల ముంబై షెడ్యూల్ లో నేను నా ఇంటి ఆహారాన్ని మిస్ అయ్యాను కానీ మీరు మీ ఇంటి నుంచి ఆహరం తెప్పించారు నాకోసం. నేను కూడా మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని పోస్ట్ చేశాడు.
He is not only a blockbuster filmmaker / superstar but also an incredibly lively, kind, generous and wonderful human being.Thank you for your kindness, amazing sense of humour and all the advance gifts for my birthday sir. had such a great time working with you 🙏@offl_Lawrence
— Kangana Ranaut (@KanganaTeam) March 15, 2023
Being a film crew you meet so many wonderful people they become more than family/friends because together you fight/face/ride many intense highs/lows, and suddenly when it’s a wrap it’s time to move on,it’s never easy to let go, tears don’t stop as I say bye again #Chandramukhi2 pic.twitter.com/eWuFElDJwt
— Kangana Ranaut (@KanganaTeam) March 15, 2023