Vasishta-Haripriya : పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో హీరో, హీరోయిన్.. సింపుల్ గా నిశ్చితార్థం..

కన్నడలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేసి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు వశిష్ఠ సింహ. కన్నడ హీరోయిన్ హరిప్రియ తెలుగులో పిల్ల జమిందార్, జై సింహా.. పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది. వీరిద్దరూ ఓ సినిమాలో కలిసి నటించారు. అప్పట్నుంచి వీరిమధ్య స్నేహం మొదలై

Vasishta-Haripriya : పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో హీరో, హీరోయిన్.. సింపుల్ గా నిశ్చితార్థం..

kannada actors Vasishta and Haripriya engaged

Vasishta-Haripriya :  సినీ పరిశ్రమలో ఆర్టిస్టులు సినిమా వాళ్ళతోనే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఇటీవల అన్ని పరిశ్రమలో ఈ పెళ్లిళ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే తమిళ పరిశ్రమలో హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో మరో హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారు.

కన్నడలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేసి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు వశిష్ఠ సింహ. కన్నడ హీరోయిన్ హరిప్రియ తెలుగులో పిల్ల జమిందార్, జై సింహా.. పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది. వీరిద్దరూ ఓ సినిమాలో కలిసి నటించారు. అప్పట్నుంచి వీరిమధ్య స్నేహం మొదలై అనంతరం అది ప్రేమగా మారింది.

RRR : రాజమౌళికి మరో హాలీవుడ్ అవార్డు..

గత కొన్ని రోజులుగా వీరు డేటింగ్ చేస్తున్నారంటూ కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే మీడియా కంట కూడా పడ్డారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కన్నడ మీడియా రాసింది. తాజాగా వారే వాళ్ళ ప్రేమని అందరికి చెప్పారు. తమ సోషల్ మీడియాలో అధికారికంగా వసిష్ఠ, హరిప్రియ కలిసి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని తెలిపారు. శనివారం నాడు కేవలం ఇంటి సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు సోషల్ మీడియాలో వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

View this post on Instagram

A post shared by Hariprriya (@iamhariprriya)