Keerthy Suresh: ‘దసరా’నే నమ్ముకున్న కీర్తి సురేష్.. హిట్టయితే రియల్ పండగే!
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాపై కీర్తి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అమ్మడికి తెలుగులో మంచి క్రేజ్ ఉన్నా, వరుస పరాజయాలతో అమ్మడికి ఇప్పుడు ఈ సినిమా చాలా కీలకంగా మారింది.

Keerthy Suresh: నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాపై కీర్తి బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. అమ్మడికి తెలుగులో మంచి క్రేజ్ ఉన్నా, వరుస పరాజయాలతో అమ్మడికి ఇప్పుడు ఈ సినిమా చాలా కీలకంగా మారింది.
కీర్తి సురేష్ లీడ్ రోల్స్ చేసిన గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఇక మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించినా కీర్తికి ఒరిగింది ఏమీ లేదని అభిమానులు భావించారు. ఆ సినిమాలో క్రెడిట్ మొత్తం మహేష్‌కే దక్కింది. దీంతో ఈసారి ఎలాగైనా తన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని కీర్తి గట్టిగా ప్రయత్నిస్తుందట. అందుకే, దసరా సినిమాలో పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర దక్కిందని.. ఈ సినిమాలో నానితో కలిసి చేసిన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఖచ్చితంగా మంచి మార్కులు వేస్తారని ఆమె భావిస్తోంది.
కాగా, ఈ సినిమాలో హీరో నాని ఫస్టాఫ్‌లో సాఫ్ట్‌గా కనిపిస్తాడని.. సకండాఫ్‌లో మాత్రం ఉగ్రనారసింహుడిగా మారిపోతాడని చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెబుతున్నాడు. అయితే నాని అలా మారపోయే క్రమంలో కీర్తి సురేష్‌తో కలిసి చేసే యాక్టింగ్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని ఆయన అంటున్నాడు. ఈ పవర్‌ఫుల్ సీన్‌లో కీర్తి సురేష్ పండించే ఎమోషన్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తానికి కీర్తి సురేష్ ఆశలన్నీ కూడా ఇప్పుడు ‘దసరా’పైనే ఉన్నాయని.. ఈ సినిమా హిట్ అయితే అమ్మడికి నిజమైన పండగే అని అభిమానులు అంటున్నారు.