VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

యంగ్ టాలెంటెడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. రాజావారు 'రాణి గారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం

VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

VinaroBhagyamuVishnuKatha: యంగ్ టాలెంటెడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. రాజావారు ‘రాణి గారు’, ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం సమ్మతమే, సెబాస్టియన్ పీసీ-524 సినిమాలలో నటిస్తున్నాడు. కాగా చేసిన రెండు సినిమాలతోనే నటుడిగా మంచి అప్లాజ్ దక్కించుకున్న కిరణ్ ఐదవ సినిమాకి గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం కిరణ్ ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఓ సినిమా మొదలైంది.

S.Thaman: టాలీవుడ్‌లో కరోనా కలకలం.. థమన్‌కి పాజిటివ్!

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ నంబర్ 7గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా.. మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయగా.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే డివోషనల్ టచ్ ఉన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు.

Dhanush : షూట్ మొదలు పెట్టిన ‘సార్’

పోస్టర్ డిజైన్ కూడా వైవిధ్యంగా ఉండడంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ టైటిల్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న కాన్సెప్ట్ స్కెచ్ కూడా సినిమా నేపథ్యం ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది. అలానే హెల్పింగ్ నేచర్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టడంతో ఈ సినిమాలో ప్రకృతికి కూడా ప్రాధాన్యం ఉంటుందని అర్ధం అవుతుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోయిన కిరణ్ కు ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.