ఎప్పుడొచ్చామని కాదు.. ఛాన్స్ కొట్టామా, లేదా..

ఎప్పుడొచ్చామని కాదు.. ఛాన్స్ కొట్టామా, లేదా..

Krithi Shetty to Nivetha Pethuraj: ఈ హీరోయిన్లు నిన్న కాక మొన్నొచ్చారు.. రోజుకొక్కరు వస్తున్నారు. ఒక సినిమా తర్వాత మళ్లీ అడ్రస్ కూడా ఉండరు అని అనుకున్నారు అందరూ. కానీ ఇలా వచ్చారో లేదో .. అలా పాతుకుపోయారు. చిన్న హీరోయిన్లు అయినా.. పెద్ద సినిమాలు చేస్తూ.. కెరీర్‌గ్రాఫ్ పెంచుకుంటున్నారు. మరి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న న్యూకమర్స్ ఎవరో చూద్దాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో ఛాన్సులు రావడం అంత ఈజీ కాదు.. సంవత్సరాలు సంవత్సరాలు.. కష్టపడి సినిమాలు చేస్తే స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ వస్తుంది, లేకపోతే ఒకటి రెండు సినిమాలతోనే ఫేడవుట్ అయిపోతారు. కానీ ఈ హీరోయిన్లు మాత్రం.. పెద్ద హీరోలతో ఛాన్సులు దక్కించుకుంటూ రోజు రోజుకూ బిజీ అవుతున్నారు.

‘విరాట పర్వం’ లో నివేదా..

నివేదా పేతురాజ్ అప్పుడెప్పుడో ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా, ‘అల.. వైకుంఠపురములో..’ లో అలా మెరిసినా పెద్దగా పేరు రాలేదు. లేటెస్ట్‌గా ఓ పెద్ద సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది నివేదా. రానా, సాయి పల్లవి జంటగా.. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాట పర్వం’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది నివేదా పేతురాజ్.

ఎప్పుడొచ్చామన్నది కాదు.. ఛాన్స్ కొట్టామా, లేదా..

నిన్న కాక మొన్నొచ్చిన మరో హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్ తేజ్ పక్కన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సెకండ్ ప్రాజెక్ట్‌లోనే నానితో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ఆడియన్స్‌ని అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే నాని సినిమాలో బిజీ అయ్యింది.

ఇస్మార్ట్ బ్యూటీ.. ఫుల్ బిజీ..

‘ఇస్మార్ట్ శంకర్’ తో సూపర్ సక్సెస్ చూసిన నభా నటేష్ కూడా పెద్ద సినిమా ఛాన్సులు కొట్టేస్తోంది. ప్రస్తుతం సాయి తేజ్ తో నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్‌కు రెడీగా ఉండగానే.. మాస్ మహరాజా రవితేజతో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోంది. అంతేకాదు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ తో పాటు నితిన్ ‘అంధాధున్’ రీమేక్‌లో కూడా నటించే ఛాన్సులు కొట్టేసింది నభా.

ఈ బోల్డ్ బ్యూటీ కూడా..

మరో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. తమిళ్‌లో జయం రవి హీరోగా ‘భూమి’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ్ స్టార్ శింబు కొత్త సినిమా ‘ఈశ్వరన్’ లో హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు తెలుగులో కూడా మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టింది ఈ బోల్డ్ బ్యూటీ.