Liger: రికార్డులు క్రియేట్ చేస్తోన్న లైగర్ ‘ఆఫత్’ సాంగ్!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆఫత్’ అనే ప్యూర్ రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఏకంగా మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి రికార్డును క్రియేట్ చేసింది.

Liger: రికార్డులు క్రియేట్ చేస్తోన్న లైగర్ ‘ఆఫత్’ సాంగ్!
ad

Liger: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.

Liger: ముంబైలో లైగర్ ఫీవర్.. మామూలుగా లేదుగా!

కాగా, తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈసారి ‘ఆఫత్’ అనే ప్యూర్ రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ పాటలో విజయ్, అనన్యాల రొమాన్స్ ఘాటుగా ఉండటంతో ఈ సినిమాలో ఈ పాట ఖచ్చితంగా హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఏకంగా మిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి రికార్డును క్రియేట్ చేసింది.

Liger : అనన్య ఒళ్ళో విజయ్ దేవరకొండ.. ఇదేం ప్రమోషన్స్ బాబు..

ఇంతలా ఈ సినిమా కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ సక్సెస్ సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాధ్, ఛార్మీలతో పాటు కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో పాన్ ఇండియా మూవీగా లైగర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని రౌడీ స్టార్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.