Mahaan Trailer: మహాన్ ట్రైలర్.. లెక్చరర్ లిక్కర్ కింగ్‌గా ఎందుకు మారాడు?

సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్, తన కొడుకు ధృవతో కలిసి నటించిన సినిమా 'మహాన్'.

Mahaan Trailer: మహాన్ ట్రైలర్.. లెక్చరర్ లిక్కర్ కింగ్‌గా ఎందుకు మారాడు?

Vikram

Mahaan Trailer: సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్, తన కొడుకు ధృవతో కలిసి నటించిన సినిమా ‘మహాన్’. అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 10న విడుదలవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్‌గా విడుదలైంది. మద్య నిషేధ పోరాటాన్ని ముందుండి నడిపించే వ్యక్తి.. మద్యం సిండికేట్ లీడర్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో సినిమా రూపొందినట్లుగా ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది.

సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ బ్యానర్ పై యస్.యస్. లలిత్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. సిమ్రాన్, వాణీ భోజన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తుండగా.. విక్రమ్, ధ్రువ్ ఇద్దరూ సినిమాలో తండ్రీకొడుకులుగానే నటించారు. గాంధేయవాది అయిన ఓ లెక్చరర్ లిక్కర్ కింగ్‌గా ఎందుకు మారాడు అనేదే కథాంశం.

తండ్రి అంటే పడని పాత్రలో ధృవ్ కనిపించగా.. ట్రైలర్ చివర్లో విక్రమ్ తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకుని మహాత్మా గాంధీ విగ్రహంతో నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపించారు. చివరికి హీరో మారిపోయాడా? అసలు విక్రమ్ ఇందులో హీరోనా? విలనా? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచింది చిత్రయూనిట్.