మామాంగం – ట్రైలర్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘మామాంగం’ తెలుగ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : November 9, 2019 / 07:55 AM IST
మామాంగం – ట్రైలర్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘మామాంగం’ తెలుగ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న హిస్టారికల్ డ్రామా.. ‘మామాంగం’ (హిస్టరీ ఆఫ్ ది బ్రేవ్).. కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో, ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కని ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదల చేశారు..

‘వెల్లువనాడు ప్రాంతం మామాంగమ్‌ ఉత్సవాలకు వేదిక. సంబరాలు ముగిసే నాటికి రాజులంతా కలసి కొత్త పాలకుడిని ఎన్నుకోవడం నాటి సంప్రదాయం. ఎంపికైన పాలకుడు మరో మామాంగమ్‌ వరకూ… అంటే రానున్న పన్నెండేళ్ల పాటు పదవిలో ఉంటాడు. కోజికోడ్‌ను పాలించిన జమొరిన్‌ వెల్లువనాడుపై ఆశపడి, యుద్ధంలో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నాడు. ఇతర రాజులూ… అతడి సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తున్నామంటూ తమ జెండాలను కానుకగా పంపి దాసోహమన్నారు. వెల్లువనాడుకు చెందిన వీరుడు… కొణతిరి ఆ ఓటమిని జీర్ణించుకోలేక పోయాడు. ఎలాగైనా జమొరిన్‌ను తుదముట్టించాలని ఎత్తులు వేశాడు. సర్వశక్తుల్నీ ధారపోసి ‘చావర్లు’ అనే సుశిక్షిత యోధుల్ని తయారుచేశాడు.

Read Also : ‘ఆయుష్మాన్‌భవ’ సెన్సార్ పూర్తి – నవంబర్ 15 విడుదల

‘మామాంగమ్‌ ఉత్సవాల్లో వారిని ఉసిగొల్పాడు. చావర్లంతా కలసి జమొరిన్‌పై దాడి చేశారు. జమొరిన్‌ సామాన్యుడు కాదు, చుట్టూ వేలమంది అంగరక్షకులు ఉంటారు. నిజానికి అతడే ఓ నడిచే యుద్ధం! దీంతో చావర్లు చావు దెబ్బతిన్నారు. ఆ పోరాటంలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాల పాలయ్యారు. అందర్నీ బావిలో పడేసి ఏనుగులతో తొక్కించాడు జమొరిన్‌. ‘మామాంగమ్‌’ చిత్రంలో చావర్ల గురువుగా నటిస్తున్నారు మమ్ముట్టి. చిట్టచివరి మామాంగమ్‌ 1755లో జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. కోజికోడ్‌పైకి మైసూరు సుల్తాన్‌ హైదర్‌ఆలీ దండెత్తడం, ఈస్ట్‌ ఇండియా కంపెనీతో ఆయన ‘శ్రీరంగపట్టణం ఒప్పందం’ కుదుర్చుకోవడం… తదితర కారణాలతో కేరళలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మామాంగ ఉత్సవానికి కూడా తెరపడింది’.

ఈ పరిస్థితులన్నిటినీ ‘మామాంగం’ చిత్రం ద్వారా కళ్లకు కట్టబోతున్నారు దర్శక, నిర్మాతలు.. త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. మలయాళంతో పాటు, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లోనూ ‘మామాంగం’ విడుదల కానుంది. కెమెరా : మనోజ్ పిళ్లై, సంగీతం : ఎమ్.జయచంద్రన్, బ్యాగ్రౌండ్ స్కోర్ : సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా, ఎడిటింగ్ : రాజా మొహమ్మద్.