Manoj Vs Vishnu : మనోజ్ తో గొడవని షేర్ చేసిన మంచు విష్ణు.. ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు చూడండి అంటూ సీరియస్ పోస్ట్..

మంచు విష్ణు తన సోషల్ మీడియాలో ఈ వివాదంపై ఓ వీడియోని పోస్ట్ చేయగా ఇందులో.. మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో పాటు అన్ని ఛానల్స్ లో వచ్చిన ఈ గొడవ కవరేజ్, మంచు ఫ్యామిలీకి సంబంధించిన...............

Manoj Vs Vishnu : మనోజ్ తో గొడవని షేర్ చేసిన మంచు విష్ణు.. ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు చూడండి అంటూ సీరియస్ పోస్ట్..

Manchu Vishnu posts a video regarding issue with manoj

Manoj Vs Vishnu :  ఇటీవల మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తుండటంతో తీసిన వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టోరీలో పెట్టి.. విష్ణు ఇలా వచ్చి అప్పుడప్పుడు నా మనుషులను కొడతాడు అని చెప్పడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. రెండు రోజులు అన్ని ఛానల్స్ లో, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఈ గొడవ గురించి మోహన్ బాబు స్పందించి మనోజ్ పెట్టిన ఆ పోస్ట్ తీయించాడు. ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇక విష్ణు, మనోజ్ గొడవపై మంచు లక్ష్మి మాట్లాడుతూ.. అసలు నాకు గొడవ గురించి తెలీదు అంటూ కామెంట్స్ చేసింది.

గత కొన్నాళ్లుగా మంచు మనోజ్ కి, విష్ణుకి మధ్య మాటలు లేవని, ఇటీవల మనోజ్ పెళ్ళికి కూడా విష్ణు రాకపోవడం, మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మనోజ్, విష్ణు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరి మధ్య ఏదో గొడవ అవుతుందని వార్తలు వచ్చాయి. మనోజ్ చేసిన ఈ పోస్ట్ తో మంచు బ్రదర్స్ గొడవలు రోడ్డు మీదకు వచ్చాయి. ఇప్పటివరకు దీనిపై స్పందించని మంచు విష్ణు తాజాగా ఓ వీడియోని పోస్ట్ చేశాడు.

మంచు విష్ణు తన సోషల్ మీడియాలో ఈ వివాదంపై ఓ వీడియోని పోస్ట్ చేయగా ఇందులో.. మనోజ్ పోస్ట్ చేసిన వీడియోతో పాటు అన్ని ఛానల్స్ లో వచ్చిన ఈ గొడవ కవరేజ్, మంచు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వీడియో బిట్స్ చూపించారు. ఇందులో నా పేరు విష్ణు మంచు, మోహన్ బాబు గారబ్బాయిని అంటూ చెప్పాడు. చివర్లో ది బిగ్గెస్ట్ రియాలిటీ షో, హౌస్ ఆఫ్ మంచుస్ అని టైటిల్ వేయడంతో అంతా షాక్ అయ్యారు. అలాగే ఈ వీడియోలో ఎక్కడా కూడా మనోజ్ ని చూపించకపోవడం గమనార్హం. స్ట్రీమింగ్ ఇన్ 2023 అని కూడా పెట్టడం విశేషం. ఇక ఈ వీడియోని పోస్ట్ చేసి ఇది ఆరంభం మాత్రమే అని ఇంగ్లీష్ లో టైటిల్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Das Ka Dhamki : అదిరిపోయిన దాస్ కా ధమ్కీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్స్..

అయితే నిజంగానే మంచు ఫ్యామిలీ రియల్ రియాలిటీ షో ప్లాన్ చేస్తుందా లేక ఇది కూడా గొడవలో భాగమేనా, ఇదంతా ప్రమోషన్ స్ట్రాటజీనా అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ గొడవ నిజం అయినా కాకపోయినా మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఇది నిజంగా గొడవే, మనోజ్ చేసింది చేశాడు, ఇక నుంచి నేను చూపిస్తా అన్నట్టు కౌంటర్ ఇచ్చినట్టు ఉంది అనిపిస్తుంది. మరి ఇది గొడవనా లేక రియాలిటీ షోనా తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందేనేమో.