Pakka Commercial: ముహూర్తం పెట్టేసిన మారుతీ-గోపీచంద్.. హిట్ కొడతారా?

వరుస ఫ్లాప్‌లతో నిరాశలో ఉన్న మ్యాచో స్టార్ గోపిచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలని పంతంతో ఉన్నాడు. 'పక్కా కమర్షియల్' మూవీతో ఆడియన్స్ మెప్పు పొందేందుకు సరికొత్తగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Pakka Commercial: ముహూర్తం పెట్టేసిన మారుతీ-గోపీచంద్.. హిట్ కొడతారా?

Pakka Commercial

Pakka Commercial: వరుస ఫ్లాప్‌లతో నిరాశలో ఉన్న మ్యాచో స్టార్ గోపిచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలని పంతంతో ఉన్నాడు. ‘పక్కా కమర్షియల్’ మూవీతో ఆడియన్స్ మెప్పు పొందేందుకు సరికొత్తగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ మారుతి రూపొందించిన ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. జులై 1న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జీఏ2 పిక్చర్స్, మూవీ క్రియేష‌న్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.

Pakka Commercial: గోపీచంద్.. వైష్ణవ్ తేజ్ రిలీజ్ వార్.. గెలిచేదెవరో?

గోపిచంద్ 29వ చిత్రంగా వ‌స్తున్న ఈ ప్రాజెక్టు ప‌లుసార్లు వాయిదా ప‌డుతూ రాగా ఫైనల్ గా ఇప్పుడు జులై 1న విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఫీ మేల్‌లీడ్ రోల్‌లో నటిస్తోంది. జిల్, ఆక్సిజన్ సినిమాల త‌ర్వాత‌ గోపీచంద్, రాశీ ఖన్నా కాంబోలో వ‌స్తోన్న హ్యాట్రిక్ సినిమా ఇది. శైలజా రెడ్డి అల్లుడు, ప్రతిరోజు పండగే, మంచి రోజులు వచ్చాయి వంటి మూవీలతో వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ మారుతి.. ‘పక్కా కమర్షియల్’ మూవీలో గోపిచంద్ క్యారెక్టర్‌ను సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Pakka Commercial : జన్మించడం.. మరణించడం కూడా ఖర్చే.. ‘సిరివెన్నెల’ రాసిన సాంగ్ విన్నారా..

మరోవైపు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక గోపిచంద్ ఫుల్ డిస్పాయింట్‌లో ఉన్నాడు. ఈ సినిమాలో కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో సత్యరాజ్‌, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బయటకొచ్చిన టీజర్లు, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేయగా.. ఇప్పుడు ఆ అంచనాలను మారుతీ, గోపీచంద్ అందుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.