Mega 154: మెగా 154కు ముహూర్తం ఫిక్స్.. వచ్చేది అప్పుడేనట!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా 154 ప్రాజెక్టును యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Mega 154: మెగా 154కు ముహూర్తం ఫిక్స్.. వచ్చేది అప్పుడేనట!

Mega 154 Movie Release Date Locked

Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గాడ్‌ఫాదర్, భోళాశంకర్ చిత్రాలతో పాటు మెగా 154 ప్రాజెక్టులో కూడా చిరు నటిస్తున్నాడు. ఈ సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. కాగా, మెగా 154 ప్రాజెక్టును యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Mega154: మెగాస్టార్‌ మూవీలో విక్టరీ వెంకటేష్.. నిజమెంత?

ఈ సినిమాతో చిరంజీవి మరోసారి తనదైన మాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమాను పండగ సీజన్‌లో రిలీజ్ చేస్తే, అది తమకు నిజమైన పండగ అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

Mega154: చిరు, రవితేజలను కలిపేది ఆమేనా..?

ఇక ఈ సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాను నిజంగానే వచ్చే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.