Mega Family : అమ్మ పుట్టినరోజుని కలిసి జరుపుకున్న మెగా బ్రదర్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒక చోట కనిపిస్తే అది ఫ్యాన్స్ కి కన్నుల పండగనే అనే చెప్పాలి. అలాంటి కన్నుల విందు నేడు అభిమానులకు దక్కింది. మెగా బ్రదర్స్ అంతా కలిసి ఒక ఫొటోలో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.

Mega Family : అమ్మ పుట్టినరోజుని కలిసి జరుపుకున్న మెగా బ్రదర్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Mega Family : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఒక చోట కనిపిస్తే అది ఫ్యాన్స్ కి కన్నుల పండగనే అనే చెప్పాలి. అలాంటి కన్నుల విందు నేడు అభిమానులకు దక్కింది. మెగా బ్రదర్స్ అంతా కలిసి ఒక ఫొటోలో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. నేడు మెగా బ్రదర్స్ అమ్మ అంజనాదేవి పుట్టినరోజు కావడంతో.. బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ. ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ పార్టీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కూడా సందడి చేశారు.

Ram Charan : ఆయన్ని ఏమన్నా అంటే ఊరుకోము.. వాల్తేరు వీరయ్య స్టేజిపై రామ్ చరణ్ వార్నింగ్..

ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి షేర్ చేస్తూ అమ్మకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన మా అమ్మ పుట్టిన రోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నా’ అంటూ ఎమోషనల్ పోస్ట్ వేశాడు. ఇక చిరు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. కాగా నిన్న వరంగల్ లో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ జరిగింది. ఈ ఫంక్షన్ కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. నిన్న చిరు-చరణ్ ని, ఇవాళ చిరు-పవన్ ని ఒకే ఫ్రేమ్ లో చూసేపాటికి అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

ఇక వీరి సినిమాలు విషయానికి వస్తే.. రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో RC15 తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో చరణ్ రెండు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే చిరంజీవి కూడా భోళాశంకర్ షూటింగ్ మొదలు పెట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తమిళ సినిమా వేదాళం రీమేక్ గా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఏమో హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే చాలా లేటు అవుతూ వస్తున్న ఈ చిత్రం.. చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూడు సినిమాలో ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.