అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక మ్యారేజ్…

  • Published By: bheemraj ,Published On : December 9, 2020 / 09:29 PM IST
అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక మ్యారేజ్…

Mega Daughter Niharika Marriage : మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 7.15 నిమిషాలకు.. వేద మంత్రాల నడుమ నిహారిక, చైతన్య వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలంతా హాజరయ్యారు.



కరోనా నేపథ్యంలో ఈ వివాహ కార్యక్రమానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం బంధు మిత్రులు, కొంతమంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఈ నెల 11న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.



గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నాగబాబు కుమార్తె నిహారక వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం తర్వాత.. నిహారిక, చైతన్య వివాహ శుభ ముహూర్తాన్ని డిసెంబర్‌9 నిర్ణయించారు. అందరి సెలబ్రిటీల్లాగే నిహారిక మ్యారేజ్‌ను కూడా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా ప్లాన్‌ చేశారు.



అందుకే.. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ ప్యాలెస్‌లో ప్లాన్‌ చేశారు. 3 రోజుల క్రితమే సకుటుంబ సపరివార సమేతంగా కొణిదెల, అల్లు, జొన్నలగడ్డ కుటుంబాలు ఉదయ్‌ పూర్ చేరుకున్నాయి. హల్దీ ఫంక్షన్‌ నుంచి మెహందీ పంక్షన్‌కు అన్నీ అద్భుతంగా జరిగాయి.
https://10tv.in/actress-konidela-niharika-marriage-photos/