Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు : మెగాస్టార్ చిరంజీవి

సాయిధరమ్ తేజ్ ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభిమానులు ఆందోళన పడవద్దన్నారు. రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు : మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi

Sai dharam Tej accident : మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయిధరమ్ గాయపడి, ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఛాతి, కుడి కన్ను, పొట్ట భాగంలో గాయాలు అయ్యాయి. తాను నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవ్వడంతో కిందపడ్డాడు. నిన్న రాత్రి 8 గంటలకు కేబుల్ బ్రిడ్జ్-ఐకియా రోడ్డు మార్గంలో ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ కు చికిత్స కొనసాగుతోంది.

సాయిధరమ్ తేజ్ కు జరిగిన ప్రమాద ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభిమానులు ఆందోళన పడవద్దన్నారు. రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. నిపుణులైన వైద్యులు పర్యవేక్షణలో కోలుకుంటున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో సాయిధరమ్ తిరిగి వస్తాడని తెలిపారు. సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ ను జూబ్లీహిల్స్ అపోలో డాక్టర్లు విడుదల చేశారు. తేజ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

అయితే కాలర్ బోన్ విరిగిందన్నారు. దానికి వైద్యం చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాగే 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు. తేజ్ తప్పకుండా కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వెంటిలేటర్ పై పెట్టినంత మాత్రాన ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉదయానికి కల్లా తేజ్ మాట్లాడతాడని డాక్టర్లు స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. తాను రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే షాక్ కి గురి కావడంతో సాయితేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తేజ్ ను ముందుగా హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Saidharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ పై రాయదుర్గం పీఎస్ లో కేసు నమోదు

ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. బైక్ పై వస్తున్న తేజ్.. బైక్ స్కిడ్ కావడంతో పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్ ఉండటంతో తలకు రక్షణ లభించింది. లేదంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని పోలీసులు అన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.