పోలీస్ బిడ్డగా వారందరికీ చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను..

లాక్‌డౌన్ విజయవంతం కావడానికి పోలీసులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు..

  • Published By: sekhar ,Published On : April 10, 2020 / 07:40 AM IST
పోలీస్ బిడ్డగా వారందరికీ చేతులెత్తి సెల్యూట్ చేస్తున్నాను..

లాక్‌డౌన్ విజయవంతం కావడానికి పోలీసులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు..

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో దేశంలో కొన్నివారాల పాటు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎక్కడి ప్రజలు అక్కడే పూర్తిగా ఇళ్లకు పరిమితం అయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ విజయవంతం కావడానికి పోలీసులు చేస్తున్న కృషి అనిర్వచనీయమని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు..

ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం రేయింబవళ్లు ఎంతో శ్రమపడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు వారికి, ముఖ్యంగా హైదరాబాద్‌లోని పోలీసులు ప్రజల రక్షణ కోసం పడుతున్న కష్టం నిజంగా అమోఘం అని, ప్రజలందరూ కూడా పోలీసులకు ఎక్కడికక్కడ సహకరించి తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉండాలని సూచించారాయన.

Read Also : అలాంటివి మనవల్ల కాదు.. అవి అడుగుతున్నారనే సినిమాలు మానేశా..

ఈ మహమ్మారి కరోనాని వీలైనంత త్వరగా మన దేశం నుండి తరిమికొట్టవచ్చని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు. ఒక పోలీసు బిడ్డగా ఇటువంటి విపత్కర సమయంలో మనకు ఎంతో సాయం అందిస్తున్న పోలీసులందరికీ నా సెల్యూట్, జైహింద్ అంటూ తన వీడియోలో తెలిపారు మెగాస్టార్. ఈ వీడియోపై తెలంగాణ డీజీపీ మహేంద‌ర్ రెడ్డి స్పందిస్తూ ‘‘మీరు మాకే కాదు.. పోలీసు శాఖవారందరికీ స్ఫూర్తినిచ్చారు. మీ నుండి స్ఫూర్తి పొందిన ప్రేక్షకులను కూడా మేల్కొలిపారు. పోలీసు కుటుంబంలో ఓ వ్యక్తిగా ఉన్న మీరు కోవిడ్‌పై మేం చేస్తున్న పోరాటానికి గొప్ప సాయాన్ని చేశారు. మీ మాట‌లు మ‌రింత మందిని లాక్‌డౌన్‌ను క‌ట్టుబ‌డి ఉంటార‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు. కాగా లౌక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న సినీ కార్మికలను కరోనా క్రైసిస్ చారిటీ (సీ సీ సీ) ద్వారా ఆదుకుంటున్నారు చిరు.