Tamannaah: మిల్కీ బ్యూటీ మరో ఐటెం నెంబర్.. ఈసారి మెగాహీరోతో!

తోటి హీరోయిన్లతో పోలిస్తే తమన్నా తెలివిగా కెరీర్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు. అయినా ఇప్పటికీ కుర్ర హీరోలతో కూడా జోడీ కడుతుంది. మరోవైపు సోలో సినిమాలు.. వెబ్ సిరీస్లు, టీవీ షోస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

10TV Telugu News

Tamannaah: తోటి హీరోయిన్లతో పోలిస్తే తమన్నా తెలివిగా కెరీర్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు. అయినా ఇప్పటికీ కుర్ర హీరోలతో కూడా జోడీ కడుతుంది. మరోవైపు సోలో సినిమాలు.. వెబ్ సిరీస్లు, టీవీ షోస్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్ కూడా ఒకే చేస్తూ ఆర్ధికంగా కూడా గిట్టుబాటు అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.

తమన్నా ప్రస్తుతం తెలుగులో ఎఫ్ 3, సీటిమార్, దట్ ఈజ్ మహాలక్ష్మి, గుర్తుందా శీతాకాలం సినిమాలు చేస్తుండగా మెగా హీరోతో ఐటెం సాంగ్ కు కూడా సిద్ధమైంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం గ‌ని. కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి, దబాంగ్ 3 ఫేం స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

కాగా, ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ ఉండ‌గా..స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా ఈ పాట‌లో మెరువ‌నుంద‌ట‌. గని సినిమా షూటింగ్ స్పాట్ లో తమన్నా కనిపించడంతో ఆమె ఈ ఐటెం సాంగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కేజీఎఫ్, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఐటెం సాంగ్స్, ప్రత్యేక పాత్రలను చేసిన తమన్నా మరోసారి గని సినిమాతో ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమన్నా ఐటెం నెంబర్ తో ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

10TV Telugu News